Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sankranti 2026: దేవాన్ష్ ఆట, చంద్రబాబు మాట.. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను తన స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి పాల్గొని గ్రామస్తులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారుల కోసం పలు వినోదాత్మక క్రీడలను ఏర్పాటు చేశారు. మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి ఆటలు చిన్నారులను ఎంతో ఉత్సాహపరిచాయి. ఈ క్రీడలన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా వీక్షిస్తూ, చిన్నారులతో కలిసి సంతోషంగా గడిపారు.

CM Chandrababu Naidu Celebrates Sankranti with Family and Villagers at Naravaripalle

ఈ ఆటల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణల మనవళ్లు ఆటల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం వివిధ క్రీడల్లో విజయం సాధించిన చిన్నారులకు సీఎం చంద్రబాబు స్వయంగా బహుమతులు అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగుతూ ఆప్యాయంగా ముచ్చటించారు.

సీఎం చంద్రబాబు దాదాపు రెండు గంటల పాటు గ్రామస్తులు, చిన్నారులతో కలిసి గడిపారు. మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించి, వాటిని ప్రశంసిస్తూ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పండుగ వాతావరణం నారావారిపల్లెలో మరింత ఉత్సాహంగా మారింది.

అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన సీఎం చంద్రబాబు, వాటిని పరిశీలించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా వినడం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+