Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల షెడ్యుల్‌పై సీఎం జగన్ ఆసక్తికరమైన ట్వీట్

ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ స్పందించారు. తన అధికారిక ట్విట్టర్‌లో 13,2024 ''సిద్ధం'' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయిన అధికార వైసీపీ, తాజాగా విడుదలైన ఎన్నికల తేదీపై తాము ''సిద్ధం''గా ఉన్నామంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇప్పటికే జగన్ ''సిద్ధం'' సభలతో పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు.

ఇప్పుడు అదే నినాదంతో తాము ఎన్నికలకు ''సిద్ధం''గా ఉన్నమంటూ జగన్ ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను జగన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నెల 18 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఇచ్చాపురం నుంచి జగన్ తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఇక జగన్‌ను ఓడించడానికి ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఏకం అయ్యాయి.

CM Jagan s interesting tweet on election date

టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి కట్టగా, జగన్ సోదరి షర్మిల అన్న ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ప్రకటించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

పోలింగ్ తేదీలుః
మొదటి దశ - ఏప్రిల్ 19 - మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు

రెండవ దశ - 26 ఏప్రిల్ - మొత్తం స్థానాలు - 89

మూడవ దశ - 7 మే - మొత్తం స్థానాలు - 94

నాల్గవ దశ - 13 మే - మొత్తం స్థానాలు - 96

5వ దశ - 20 మే - మొత్తం స్థానాలు - 49

ఆరవ దశ- 25 మే - మొత్తం స్థానాలు - 57

7వ దశ - 1 జూన్ - మొత్తం స్థానాలు - 57

ఓట్ల లెక్కింపు
జూన్ 4

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+