వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణానీరు: ప్రధానితో రేపు సిఎం అఖిలపక్షంతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కృష్ణాజలాల పంపకంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష ప్రతినిధులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు శుక్రవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలువనున్నారు. ఇందుకు అఖిల పక్ష ప్రతినిధులతో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. కృష్ణా నీటి పంపకంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని అఖిల పక్ష నేతలు ప్రధానికి వివరించనున్నారు.

కృష్ణా జలాల విషయంలో తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని అఖిల పక్ష ప్రతినిధులు ప్రధానిని కోరుతారు. ప్రధాని వద్దకు అఖిల పక్షం ప్రతినిధులను తీసుకుని వెళ్తానని ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన అఖిల పక్ష భేటీలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

CM to lead All Party delegation to PM on Friday

ప్రధానితో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇండియా టుడే గ్రూప్ ఉత్తమ పరిపాలనకు ఇచ్చే అవార్డును స్వీకరిస్తారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం తర్వాత ఆయన ప్యానెల్ చర్చలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, జమ్మూ కాశ్మీర్ ముఖ్మయంత్రి ఒమర్ అబ్దుల్లా, ఓవర్సీస్ అపైర్స్ మంత్రి వాయలార్ రవి తదితరులు పాల్గొంటారు.

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో విభజన ఉద్యమాలు చెలరేగుతున్నప్పటికీ ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన అద్యయనంలో ఉత్తమ పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ అవార్డును అందుకుంటోంది. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలను చేపట్టి అమలు చేసినందుకుగాను ఆంధ్రప్రదేశ్ ఈ అవార్డుకు ఎంపికైంది.

English summary
The Chief Minister Mr.N. Kiran Kumar Reddy will lead an All Party delegation and present a Memorandum on the judgement of Justice Brijesh Kumar Tribunal on Krishna Waters (KWDT-II) to the Prime Minister Dr Manmohan Singh on Friday, 20-12-2013 in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X