పకడ్బందీగా దిశ.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం: సమీక్షలో సీఎం జగన్

దిశ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్ ఆదేశించారు. దిశ చట్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ప్రతి మహిళ ఫోన్ లో దిశ యాప్ ఉండాలని.. ఇందుకోసం వాలంటీర్లు, మహిళా పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు.. దిశ యాప్ పై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులతో సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.

 యాక్షన్ ప్లాన్

యాక్షన్ ప్లాన్

దిశ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాలను అరికట్టడం వంటి అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. కాలేజీలు‌, యూనివర్సిటీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ సూచించారు. మిషన్ డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌ కోసం అందరూ పని చేయాలని చెప్పారు. సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు జగన్ ఆదేశించారు.

 దిశ యాప్..

దిశ యాప్..

ఇప్పటివరకూ 74,13,562 మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌ చేశారని పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. దిశ యాప్‌ ద్వారా 5వేల 238 మందికి సాయం అందించినట్లు వివరించారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్‌ చేసినట్లు తెలిపారు. మహిళా భద్రత కోసం జగన్ ప్రభుత్వం దిశ మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం వివరించింది.

 మినిట్స్..

మినిట్స్..

ఆపదలో ఉన్నా, ప్రమాదం కలగనుందనే అనుమానం వచ్చినా వెంటనే దిశ యాప్‌లోని రెడ్‌ బటన్‌ ప్రెస్‌ చేస్తే వెంటనే పోలీసులకు ఇతర అధికారులకు సమాచారం అందుతుంది. నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి, మహిళ, ఉద్యోగిని దిశ యాప్‌ను వినియోగించి రక్షణ పొందాలని ప్రభుత్వం కోరింది.

డ్రగ్స్‌పై ఆరా...

డ్రగ్స్‌పై ఆరా...

అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం జగన్ కోరారు. కాలేజీ/ వర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండకూడదని స్పష్టంచేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రగ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి.. సప్లై గురించి ఆరా తీయాలన్నారు. అలాగే అక్రమ మద్యం తయారీ, ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు. సమీక్ష సమావేశంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+