బస్సుల్లో నల్లులు: ఫిర్యాదులు, స్పందించిన మంత్రి
హైదరాబాద్: ఏపీయస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయలేమంటూ, మరీ ముఖ్యంగా నల్లులు కుట్టాయంటూ వస్తున్న ఫిర్యాదులతో అధికారలు అప్రమత్తమయ్యారు. ఓ ప్రయాణికుడు ఏకంగా రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకే కంప్లైంట్ లేక పంపించాడు.
ఆ కంప్లైంట్‌లో లేఖతోపాటు, తాను ప్రయాణించిన బస్సు టిక్కెట్ స్కాన్‌కాపీ, మరో రెండు ఫొటోలు పంపారు. ఆ ఫొటోల్లో ఒకటి ఒక వ్యక్తి తొడ మొత్తం నల్లులు కుట్టినట్లు ఎర్రగా కొన్ని చోట్ల రక్తం కారినట్లు ఉంది. ఏంటా అని కంప్లైంట్ లేఖను చదివిన మంత్రి శిద్ధా ఆశ్చర్యపోయారు.
చెన్నైకి తాను ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో నల్లులు కుట్టడం వల్ల తనకు ఇలా జరిగిందని, ఆర్టీసీలో ప్రయాణించిన పాపానికి ఆసుపత్రి పాలయ్యానని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన మంత్రి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ మేనేజిండ్ డైరెక్టర్‌కి ఆ మెయిల్‌ను పంపించారు. ఆర్టీసీ అధికారులు ఆ ప్రయాణికుడికి క్షమాపణ కోరుతూ తిరిగి మెయిల్ పంపించారు.

నల్లల సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో భాగంగా కర్ణాటక బస్సుల్లో నల్లుల్ని నిర్మూలించే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ పద్ధతిని రవాణాశాఖ మంత్రి సొంత జిల్లా నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన సదరు ఏజెన్సీని సంప్రదించి ప్రకాశం జిల్లాలో కొన్ని బస్సుల్లో నల్లుల్ని తొలగించాలని సూచించారు.
ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆ కంపెనీ ప్రతినిధులు కొన్ని లగ్జరీ బస్సులను తీసుకొని వాటిలో నల్లుల్ని చంపే మందులోపల ఉంచి బస్సుమొత్తం కనిపించకుడా ప్లాస్టిక్ కవర్ కప్పేశారు. అలా 24గంటలు ఉంచి తర్వాత బస్సును శుభ్రం చేయగా ఒక్కో బస్సు నుంచి గంపల కొద్దీ నల్లులు బయటపడ్డాయి.
ఇంత పెద్ద మొత్తంలో బస్సుల్లో నల్లులుంటే వేసవిలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని భావించిన అధికారులు సూపర్ లగ్జరీ, ఇంద్రా, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో నల్లులను నిర్మూలించాలని నిర్ణయించారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications