కర్నూలు జిల్లాలో కోట్లకు షాక్: టిడిపిలో చేరిన ముఖ్య అనుచరుడు
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంత్ రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు.
Recommended Video

కర్నూలు: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంత్ రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు.

ముందస్తు ప్రచారం, పార్టీల ఆపరేషన్
ముందస్తు ఎన్నికలకు అవకాశమున్నదనే ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రం కూడా అదే ఆలోచనతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు పట్టులేని ప్రాంతాల్లో కీలక నేతలను టిడిపి, వైసిపిలు తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి.

వైసిపి, టిడిపి వైపు నేతల చూపు
ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి భారీగా చేరికలు కనిపించాయి. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మరికొంతమంది వైసిపి నుంచి టిడిపిలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ సీట్ల గొడవ, స్థానిక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని టిడిపి, వైసిపిల వైపు నేతలు చూస్తున్నారు.

టిడిపిలో చేరిన హనుమంత రెడ్డి
ఆదివారం కర్నూలు జిల్లాలోని హాలహర్వి మండలం చింతకుంటలో ఐదు వందల మందితో కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనుమంత రెడ్డి టిడిపిలో చేరారు. ఆయనతో పాటు కొందరు సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మజ్లిస్ నేత కూడా
మరోవైపు, జిల్లాకు చెందిన మజ్లిస్ నేత అబ్దుల్ రెహ్మాన్ కూడా టిడిపి కండువా కప్పుకున్నారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ సమక్షంలో ఆయన ఆయన టిడిపిలో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు చెప్పారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications