Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వస్తావా: ఎన్ కన్వెన్షన్లో యువనేతల పౌరుషం: ఫుటేజీలో ఏముంది?

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎన్ కన్వెన్షన్‌లో ఇద్దరు యువనేతల మధ్య గొడవ సంచలనం సృష్టించింది. ఇరువురు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే. వంశీచంద్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే. ఇరువురు కాంగ్రెస్ యువనేతల గొడవ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఇతర సీనియర్ నేతలు దీనిపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. పొన్నాల ఫోన్ చేసి వాకబు చేశారు.

తన బావమరిది పెళ్లి జరుగుతోందని, తాను వంశీచంద్ రెడ్డిని పెళ్లికి పిలువలేదని, పిలవని పేరంటానికి వచ్చాడని, తన పైన వారు దాడికి పాల్పడ్డారని విష్ణు ఆరోపించారు. తననే కొట్టారని వంశీచంద్ రెడ్డి చెబుతున్నారు. అయితే, ఎన్ కన్వెన్షన్ సెంటరులో ఉన్న వీడియో ఫుటేజి ద్వారా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తనది తప్పు కాదంటే తనది తప్పుకాదని ఇరువురు నేతలు చెబుతున్నారు.

విష్ణు వాదన...

Congress Youth leaders fight in Hyderabad

వంశీని తాము పెళ్లికి పిలువలేదని, అతను దగ్గరకు రాగా మజాక్ చేశామని, దీంతో అతని గన్‌మెన్ గన్ తీశారని విష్ణు ఆరోపించారు. నిజంగానే వారికి గొడవపడాలని ఉంటే గాంధీ భవన్ ఉందని, మైదానం ఉందని అన్నారు.

తాను పీజేఆర్ కొడుకునని, పెద్దమ్మతల్లి బిడ్డనని తమకు పౌరుషం ఉందన్నారు. నిజంగానే గొడవపడే ఉద్దేశ్యం ఉంటే మైదానానికి వెళ్దామని వంశీచంద్‌పై మండిపడ్డారు. అవసరమైతే మహబూబ్ నగర్లో తేల్చుకుందామన్నారు. వంశీచంద్ అసలు తనతో ఎందుకు గొడవపడ్డాడో తెలియదన్నారు.

వంశీచంద్ వాదన...

విష్ణు ప్రవర్తన, వ్యక్తిత్వం, ఆలోచన తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని వంశీచంద్ రెడ్డి అన్నారు. తాను పెళ్లికి హాజరయ్యానని, పక్క నుండి వెళ్తుంటే అతనే తనను పిలిచాడని, పేరు పెట్టి పిలిచినప్పుడు సంస్కారం కొద్ది అతని వద్దకు వెళ్లానని, అతని గురించి తెలిసినా తాను సంస్కారంతో వెళ్లానని చెప్పారు.

తాను ఆయనను విష్ చేశానని, తన చేతులు తీసుకున్న విష్ణు.. చేతి వేళ్లను విరగ్గొట్టే ప్రయత్నం చేశాడని, తాను రెండు సెకండ్లు ఆగానని, అతని ఇంటెన్షన్ అర్థమయిందని, తాను చెయ్యి లాక్కునే ప్రయత్నం చేశానని, అంతలోనే తన పైన దాడి జరిగిందని వంశీచంద్ చెప్పారు. తన గన్‌మెన్లను పట్టుకొని ముప్పై నలభై మంది దాడికి యత్నించారన్నారు.

ఎన్ కన్వెన్షన్ సెంటరులో సీసీటీవి ఫుటేజీ ఉంటుందని, అందులో వాస్తవాలు కనిపిస్తాయని, దానిని బహిర్గతం చేద్దామన్నారు. అందులో ఎవరిది తప్పో తేలుతుందన్నారు.

పుటేజీలో...?

విష్ణు, వంశీచంద్ మధ్య జరిగిన వివాదం పుటేజీ వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. ఫుటేజీలో ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే విష్ణు అనుచరులు కొందరు పరుగెత్తించి కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతమంది ఎమ్మెల్యేపై దాడికి దిగడంతో ఆయన పరుగెత్తారు. అయినా వెంటపడి తరుముతూ కొట్టడంతో ఆయన గన్‌మెన్ తుపాకీ తీయడం కనిపించిందంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+