వేసవిలో బీరు తాగుతున్నారా? నష్టాలే కాదు...లాభాలు కూడా ఉన్నాయి..!
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని సీసాలపై రాసే ఉంటుంది. అయినా అవేమీ పట్టించుకోకుండానే మందుబాబులు సీసాలకు సీసాలు ఖాళీ చేస్తుంటారు. మద్యంవల్ల నష్టాలేకాదు.. లాభాలు కూడా ఉన్నాయనే విషయం తెలుసా. బీరు తాగడంవల్ల ఆరోగ్యానికి మంచిది. ఎలా మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. సరదాగా స్నేహితులతో కబుర్లు చెబుతూ బీరు సేవించడం, సోషల్ డ్రింకింగ్ గా, మరేదైనా వేడుకలసమయంలో బీరు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది.
ఎక్కువగా తాగడం వల్ల ఎసోఫాగియల్ క్యాన్సర్, సిర్రోసిస్, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు ఎదురవుతాయి. కానీ మితంగా తీసుకుంటే మద్యపానం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసలు మద్యం ముట్టనివారికంటే పరిమితంగా బీరు, సాధారణ ఆల్కహాల్ తీసుకునేవారే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. బీరు తాగడంవల్ల ఎటువంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

* మధ్యస్థంగా బీరు తాగేవారికి కరోనరీ ఆర్టరీ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 40% తక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది.
* బీరులో ఉండే హాప్స్ యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీరులో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
* బీరులో శాంటోహుమోల్ అనే ప్రీనిలేటెడ్ పదార్థం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్‌ఫెక్షియస్ లక్షణాలుండటంతో శరీర భాగాల్లో వాపును తగ్గిస్తుంది. తరుచుగా బీరు తాగేవారికి గ్యాంగ్రేన్ వంటి అనారోగ్యాలు కలగవు.
* బయోయాక్టివ్ పాలీఫెనాల్స్, సిలికాన్, విటమిన్ బి వంటివి బీరులో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. ఫైబర్, లిపోప్రొటీన్ సమ్మేళనాలు బీరులో ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీని ఫలితంగా తరచుగా బీరు తాగేవారిలో ధమనులకు సంబంధించిన ఆరోగ్యం బాగుంటుంది.
* బీరులో ఆల్కహాల్ కంటెంట్ తక్కువ. నాలుగు నుంచి ఆరు శాతమే ఉంటుంది. అయితే ఈ పర్సంటేజ్ బ్రాండ్ ను బట్టి మారుతుంటుంది. అతి తక్కువ కెలోరీలుండటంవల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పెద్దగా ఉండదు. పింట్ బీరులో 208 క్యాలరీలుంటాయి.
* మద్యం ఎక్కువగా తీసుకుంటే హ్యాంగోవర్ అవుతుంది. బ్రాందీ, విస్కీ వంటివాటితో పోలిస్తే బీరు తాగడంవల్ల తక్కువ డీహైడ్రేషన్ కలుగుతుంది. హ్యాంగోవర్ రాదు. అయితే బీరును ఎక్కువగా తాగినా అనర్థమే.
* బీర్లలో ఉండే శాంటోహుమోల్ అనే ఫ్లేవనాయిడ్లకు క్యాన్సర్‌కు కారణమయ్యే ఎంజైమ్‌లను నిరోధించే శక్తి ఉంటుంది. ఇతర అనారోగ్యాలను సైతం ఇది దూరం చేస్తుంది.
* కిడ్నీలలో ఏర్పడే రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి బీరు ఉపయోగపడుతుంది. ఈ వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపేందుకు బీరు తోడ్పడుతుంది. అయితే మెడికల్ ట్రీట్‌మెంట్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.












Click it and Unblock the Notifications