ఆంధ్రప్రదేశ్‌లో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు ఇవే: ఆ రెండు జిల్లాలు మినహా అన్ని!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్ జిల్లాల జాబితాను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దేశంలో ఉన్న మొత్తం 640 జిల్లాల్లో మొత్తం 170 జిల్లాలను హాట్‌స్పాట్స్ కేంద్ర వైద్యారోగ్యశాఖ గుర్తించింది.

తెలుగు రాష్ట్రాల్లో 19 హాట్ స్పాట్లు..
లాక్‌డౌన్ కాలం పొడిగించిన నేపథ్యంలో ఆ సమయాన్ని కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఉపయోగించుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్ రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు. హాట్ స్పాట్ జిల్లాలతోపాటు కంటైన్మెంట్ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 19 జిల్లాలు హాట్ స్పాట్ జాబితాలో ఉన్నాయి.

ఆ రెండు జిల్లాలు మినహా ఏపీలో అన్ని హాట్ స్పాట్లే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. మొత్తంగా తెలంగాణలో 8 జిల్లాలను, ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగిలిన 11జిల్లాలను హాట్ స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది.
రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు.. ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు చేయడం జరుగుతుందని తెలిపింది.
Recommended Video

ఏపీలో పెరిగిన కేసులు.. గుంటూరు టాప్
రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కర్నూలులో 13, గుంటూరు లో 4, కడప లో 3, నెల్లూరు లో 2, అనంతపూర్ లో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 23 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 525 కి పెరిగింది. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 525 పాజిటివ్ కేసు లకు గాను 20 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 491. కాగా, ఇప్పటి వరకు అత్యధికంగా గుంటూరులో 122, కర్నూలులో 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications