కాసేపట్లో నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్10.. ప్రత్యేకతలు ఇవే..
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 నింగిలోకి దూసుకెళ్లబోతోంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించనుంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్10 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. చంద్రయాన్-2 తర్వాత ఫస్ట్ జీఎస్ఎల్వీ వాహక నౌకను ఇస్రో ప్రయోగిస్తోంది.

పరిస్థితులు అనుకూలించడంతో జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్‌ను మిషన్‌ను టేకప్ చేసింది. దాన్ని పూర్తి చేసింది. గురువారం తెల్లవారు జామున 5:43 నిమిషాలకు దాన్ని అంతరిక్షంలోకి పంపించబోతోంది. దీన్ని విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తోన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధా కేంద్రంలోని సెకెండ్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది.
50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. ఈ శాటిలైట్ జీవిత కాలం 10 సంవత్సరాలుగా నిర్ధారించారు. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్-03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.












Click it and Unblock the Notifications