మిథున్ రెడ్డికి కల్పించే సౌకర్యాలు ఇవే..

Peddireddy Midhun Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రాజమండ్రి కేంద్ర కారాగారంలో సౌకర్యాలను కల్పించడానికి అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది.

మద్యం కుంభకోణం కేసును విచారిస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టింది. విచారణల అనంతరం ఆయనను ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

Court allows special amenities to MP P Mithun Reddy

దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయనకు 4196 నంబర్ కేటాయించారు. కాగా- తనకు జైలులో సదుపాయలు కల్పించాలని మిథున్ రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ప్రత్యేకంగా పిటీషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారించిన అనంరం సదుపాయాలు కల్పించడానికి న్యాయస్థానం అంగీకరించింది. జైల్లో టీవీ, మంచం, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి అయిదు రోజులపాటు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.

అలాగే- రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్స్ వంటి సదుపాయాలను కల్పించడానికి న్యాయస్థానం అంగీకరించింది. మిథున్ రెడ్డికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.

మంగళవారం ఉదయం 10.30 గంటలకల్లా అభ్యంతరాలను న్యాయస్థానానికి తెలియజేయాలని సూచించింది. లిక్కర్‌ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని ఏ-4గా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. ఈ అరెస్టును తప్పుపడుతోంది వైఎస్ఆర్సీపీ. అక్రమ కేసుగా అభివర్ణిస్తోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు చేసినట్లు మండిపడుతోంది.

డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. సూపర్ సిక్స్ అమలులో టీడీపీ కూటమి ఘోరంగా విఫలమైందని, ప్రజల దృష్టి మరల్చడానికే అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ధ్వజమెత్తుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+