మా నాన్న, తమ్ముడు తాగుడు వల్లే చనిపోయారు- చెవిరెడ్డి భావోద్వేగం

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న నిందితులకు విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నిందితులందరూ ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు. ప్రస్తుతం ఏడుమంది నిందితులు విచారణను ఎదుర్కొంటోన్నారు. వారందరికీ రిమాండ్ ను పొడిగించింది ఏసీబీ కోర్టు.

కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు, బాలాజీ యాదవ్‌, నవీన్‌కృష్ణలకు కోర్టు గతంలో విధించిన కస్టడీ నేటితో ముగిసింది. దీంతో వారిని ఈ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం వారి రిమాండ్ ను ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం. ఇదే కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్‌ బెయిల్ పై విడుదల అయ్యారు. వీరికి డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సిట్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Court has extended the remand of the accused in AP Liquor Scam to September 18

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. మనసా.. వాచా.. కర్మేణా తనకు లిక్కర్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. లిక్కర్ జోలికి ఎప్పుడూ పోలేదని చెప్పారు. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాన్న తాగుడును చూడలేక అమ్మ ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇది కళ్లారా చూశానని అన్నారు. అదే తాగుడు వల్ల నాన్న, తమ్ముడు చనిపోయారని చెప్పారు. కుటుంబంలో అలా జరిగాక లిక్కర్ అంటే ధ్వేషమని పేర్కొన్నారు.

తనపై ఎటువంటి కేసులు పెట్టుకున్నా, అరెస్టులు చేసినా ఫర్వాలేదని, చిన్నప్పటి నుంచీ ధ్వేషిస్తూ వచ్చిన లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం బాధ కలిగించిందని చెవిరెడ్డి అన్నారు. 13 సంవత్సరాలుగా సొంత ఖర్చులతో ఓ వేదపాఠశాలను నడిపిస్తోన్నానని, అందులో 160 మంది పిల్లలు చదువుకుంటున్నారని, అలాంటి తాను తాగుడుకు అలవాటుపడితే దాన్ని నడిపించే నైతిక హక్కును కోల్పోయినట్టవుతుందని పేర్కొన్నారు.

లిక్కర్ తో సంబంధం ఉన్న ఏ వ్యాపారంలో అయినా తాను పెట్టుబడులు పెట్టివుంటే వాటిని అటాచ్ చేసుకోవచ్చని చెవిరెడ్డి కోరారు. సంబంధం లేని కేసులో ఇరికించి బతుకుతెరువు మీద, కడుపు మీద కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తికుడినైన తాను దేవుడిని నమ్ముకుంటానని, నిజాయితీతో బయటికి వస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+