ఈడీ కస్టడీకి ఎంపీ మాగుంట తనయుడు - ఆ సంబంధాలే కీలకం..!!
లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డికి కోర్టు పది రోజుల ఈడీ కస్టడీ విధించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డికి పది రోజుల ఈడీ కస్టడీ విధించారు. ఈ మేరకు రౌస్ ఎవిన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. సౌత్ గ్రూపు ద్వారా ఆప్ కు వంద కోట్ల రూపాయాలు ఇవ్వటంలో రాఘవ రెడ్డి కీలకంగా వ్యవహరించాని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ప్రమేమం పైన ఈడీ తమ వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు విన్న తరువాత పది రోజులు పాటుగా కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఈడీ విచారణలో పలు అంశాల పైన ఆరా తీసినట్లు సమాచారం. సీబీఐ కూడా ఇప్పటికే విచారణ చేసింది. ఇప్పటి వరకు రాఘవ రెడ్డిని నిందితుడా కాకుండా ప్రమేమం ఉందనే కోణంలో ప్రస్తావన చేసింది. కానీ, ఇప్పుడు అరెస్ట్ తో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.
అరెస్ట్ చేసిన మాగుంట రాఘవను ఈడీ కోర్టులో ప్రవేశ పెట్టింది. మద్యం విధాన రూపకల్పనలో రూ.వంద కోట్లు చేతులు మారాయని ఈడీ వాదించింది. సౌత్‍గ్రూప్ పేరుతో వసూలు చేసి కీలక వ్యక్తుల ద్వారా పంపించారన్న ఈడీ నివేదించింది. మాగుంట రాఘవకు తయారీ, హోల్‍సేల్ వ్యాపారం ఉన్నాయని పేర్కొంది. మాగుంట రాఘవకు 2 రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయన్న ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూపు వసూలే చేసిన రూ.వంద కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారని ఈడీ తన వాదనల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో శరత్ రెడ్డి, విజయ్‍నాయర్, అభిషేక్, సమీర్, అమిత్ అరోరా, బినోయ్ అరెస్టు అయ్యారని ఈడీ వివరించింది. రాఘవకు శరత్‍రెడ్దితో మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.

లిక్కర్ స్కాం కు సంబంధించిన ముడుపుల సమీకరణలో సమీర్ మహేంద్రు కీలకంగా వ్యవహరించారని ఈడీ వాదిస్తోంది. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవకూ భాగస్వామ్యం ఉందని స్పష్టం చేసింది. మద్యం విధానంతో లబ్ది పొందేందుకు ముడుపులు ఇచ్చారు -ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని పేర్కొంది. మూడు రోజులుగా రాఘవను విచారిస్తున్న ఈడీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications