• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ

|

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే విలక్షణ నేత సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్'పై, దాని హోస్ట్ అక్కినేని నాగార్జునపై వ్యక్తిగత స్థాయిలోనూ అనూహ్య విమర్శలు చేశారు. నిన్నటిదాకా దోస్తులా వ్యవహరించిన జనసేనాని పవన్ కల్యాణ్ పైనా నారాయణ పంచ్‌లు విసిరారు. ఆయన వ్యాఖ్యలు పొలిటికల్, ఎంటర్‌టైన్మెంట్ రంగాల్లో చర్చనీయాంశం అయ్యాయి..

జడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనం

  బిగ్ బాస్ షోలో నాగార్జున తీరుపై హైకోర్టులో కేసు వేస్తా: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
  సీపీఐకి 95 ఏళ్లు..

  సీపీఐకి 95 ఏళ్లు..

  ఈ ఏడాది డిసెంబర్ 26 నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ) ఆవిర్భవించి 95 ఏళ్లు పూర్తయ్యాయి. సీపీఐ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతి సిటీలో భారీ కార్యక్రమం జరిగింది. దానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సమకాలీన రాజకీయాలతోపాటు రియాలిటీ షో బిగ్ బాస్ పై, హోస్ట్ నాగార్జునపై సంచలన విమర్శలు చేశారు. నాగార్జున భార్య అమల, కోడలు సమంతలను సైతం వివాదంలోకి లాగారు..

  బిగ్‌బాస్‌లో నాగార్జున దరిద్రపు పనులు

  బిగ్‌బాస్‌లో నాగార్జున దరిద్రపు పనులు

  అమ్మాయిలు, అబ్బాయిలను అద్దెకు తీసుకుని, వందరోజులపాటు వారిని విలాసవంతమైన సెట్టింగ్ లో కలిపి ఉంచడమనేది అనైతి పద్ధతి అని, దీని ద్వారా కళామ్మతల్లికి ప్రమాదం, సమాజానికి చేటు కలుగుతాయని, బిగ్ బాస్ షో ద్వారా సాంస్కృతిక దోపిడీ జరుగుతోందని సీపీఐ నారాయణ గత సెప్టెంబర్ లో విమర్శలుచేయడం తెలిసిందే.

  తాజాగా ఆదివారం(డిసెంబర్ 27న) తిరుపతి పర్యటనలోనూ ఆయన మరోసారి బిగ్ బాస్ షోపై వాయిస్ పెంచారు. అక్కినేని నాగార్జున అంటే చాలా అభిమానమని, ఆయన సినిమాలు చూస్తుంటానని, అయితే బిగ్‌బాస్ షోలో నాగార్జున దరిద్రపు పనులు చేశారని నారాయణ తిట్టిపోసారు. ఈ రియాలిటీ షోను తిరస్కరించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చినా పట్టించుకోలేదని, చివరకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా తీసుకోవడంలేదని నారాయణ వాపోయారు.

  షాకింగ్: చలిలో మద్యం తాగితే అంతే సంగతి -వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక -న్యూ ఇయర్ పార్టీలు వద్దు

  నాగ్ భార్య, కోడళ్లకు ముద్దులిస్తామంటే..

  నాగ్ భార్య, కోడళ్లకు ముద్దులిస్తామంటే..

  ‘‘బిగ్‌బాస్‌ షోలో ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఒక యువకుడిని ఎవర్ని కిస్ చేస్తావు..? ఎవరితో డేటింగ్ చేస్తావు..? ఎవరిని పెళ్ళి చేసుకుంటావు..? అని నాగార్జున ఓపెన్‌గా అడిగారు. సమాధానమిచ్చిన వ్యక్తి కూడా ఓపెన్‌గా మాట్లాడటం ఎంతో అవమానకరం. ఆ ఫోటోల్లో నాగార్జున భార్య, కోడలు, ఆయన ఇంట్లోని మహిళా నటుల ఫోటోలు పెట్టి అడగ్గలడా? ఆయన భార్య, కోడలితో ఇతరులు డేటింగ్ చేస్తామంటే సరైందేనా? అసలు నాగార్జున ఎందుకిలా చేస్తున్నాడు? కళామతల్లికి సేవ చేయడమంటే ఇదేనా? ఇది కళామతల్లిని అవమానించినట్లు కాదా?

  క్షమాపణలు చెప్పేదాకా పోరాటం..

  క్షమాపణలు చెప్పేదాకా పోరాటం..

  బిగ్ బాస్ షోలో అసభ్య, అనైతిక, దరిద్రపుగొట్టు వ్యవహారాలపై పోలీస్ స్టేషన్, కోర్టుల వరకూ వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కనీసం కింది కోర్టులు కూడా కేసులు తీసుకోలేదు. జిల్లా కోర్టుల్లో కూడా కేసులు తీసుకోలేదు. ఇలాంటి చవకబారు షోలకు చట్టాలు కూడా భయపడుతుంటే ఇక ఏం చేయాలి? మనది పితృభూమి కాదు మాతృభూమి. మహిళలకు ఇచ్చే స్థానం ఇదేనా? మహిళలను ఇంతగా చులకన చేసి మాట్లాడటం, షోలు నిర్వహించడం ఎంతవరకు సబబు? నాగార్జున ఒక్కడే కాదు, నటులు ఎవరూ ఇలా దిగజారి పనులు చేయొద్దు. బిగ్ బాస్ షోపై త్వరలోనే హైకోర్టులో కేసు వేస్తాను. ఎంత వరకైనా పోరాడుతాను. నాగార్జున ఈ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే'' అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

  రజనీ, పవన్‌కు అంత సీన్ లేదు

  రజనీ, పవన్‌కు అంత సీన్ లేదు

  సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్ తప్ప మిగతా వాళ్లలో ఎవరూ సక్సెస్ కాలేదని గుర్తుచేసిన సీపీఐ నారాయణ.. భవిష్యత్తులో కూడా సూపర్‌స్టార్ రజినీకాంత్‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సహా సినిమావాళ్లెవరూ రాజకీయాల్లో సక్సెస్ కాబోరని జోస్యం చెప్పారు. రజనీయాంత్, పవన్ కల్యాణ్ లు విజయం సాధిస్తారేమో అనే భ్రమలు ఎవరూ పెట్టుకోవద్దన్నారు. నారాయణ నాయకుడిగా ఉండిన సీపీఐ.. మొన్నటి వరకు జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి ప్రయాణించడం, ఉమ్మడి ఉద్యమాలు చేయడం తెలిసిందే. సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై బిగ్ బాస్ నిర్వాహకులు, నాగార్జున, పవన్ కల్యాణ్ లు స్పందించాల్సిఉంది.

  English summary
  CPI National Secretary Narayana has made sensational comments at Bigg Boss Telugu 4 show and its host Akkineni Nagarjuna. At an event in Tirupati on sunday. narayana also criticises rajinikanth and pawan kalyan
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X