సీపీఎం నేత బీవీ రాఘవులు రాజీనామా..!!
సీపీఎం పార్టీలో ఏం జరుగుతోంది. సీనియర్లు ఎందుకు అనాసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ముఖ్యనేత బీవీ రాఘవులు పార్టీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసారు. సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐ లో పని చేస్తూ క్రమేణా పార్టీలో ఎదిగిన రాఘవులు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేసారు. సీపీఎం సంస్థాగత ర్మాణంలో రాఘవులు కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలోనూ రాఘవులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాఘవులు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులతో రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘువులు రాజీనామా చేశారు.కానీ ఆయన రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ నాయకులు రాఘవులును బుజ్జగిస్తున్నట్టు సమాచారం. పార్టీ నిర్మాణం, కేడర్ నియామకం విషయంలో పొలిట్ బ్యూరో సభ్యులకు, రాఘవులుకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల వ్యవహారంలో పార్టీ పరంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు రాఘవులు రాజీనామాకు కారణంగా చెబుతున్నారు.

కొంత కాలంగా సీపీఎం అంతర్గత వ్యవహారాల పైన నేతల మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఆయన నిర్ణయాల పట్ల పార్టీ సీనియర్ నేత గఫూర్ విభేదించారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గఫూర్ కొద్ది రోజుల క్రితం పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

దీనిని ఆయన ఖండించారు. తాను సీపీఎం లోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. పార్టీ పరంగా సీపీఎం ఏపీలో కార్యక్రమాల నిర్వహణలో యాక్టివ్ గా లేదు. సీపీఐ పూర్తిగా టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు రాఘవులు రాజీనామా నిర్ణయంతో మరోసారి సీపీఎం వ్యవహారాల పైన చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications