Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీమిండియాను జనసేనతో పోల్చిన మెగా బ్రదర్..మీకులాగా కల్తీ కాదంటూ

ప్రతిష్టాత్మకంగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి కప్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో రాహుల్, పాండ్యా మెరుపులతో భారత జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించడంతో సినీ , రాజకీయ ప్రముఖులు టీంకు అభినందనలు తెలుపుతున్నారు.

దీనిలో భాగంగానే మెగా బ్రదర్ నాగబాబు సైతం టీమిండియాకు అభినందనలు తెలిపారు. అయితే ఆయన విచిత్రంగా టీమిండియా విజయాన్ని జనసేనతో పోల్చుతూ ఓ ట్వీట్ చేశారు. నాగబాబు తన ట్వీట్‌లో'' గెలుపుకు అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఒక్క టాస్ కూడా గెలవకుండా ఆడిన అన్ని మ్యాచ్ లు గెలిచి 12 ఏళ్లకు ఐసీసీ చాంపియన్ షిప్ సాధించింది టీమిండియా. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా 12 ఏళ్లకు 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించింది జనసేన. ఈ రెండిటికీ ఒకే లాంటి పోలికలు.. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం అంటూ ట్వీట్‌లో నాగబాబు చెప్పుకొచ్చారు.

Cricket fans are harshly criticizing Nagababu

నాగబాబు చేసిన ఈ ట్వీట్‌పై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా విజయంపై అభినందనలు తెలిపితే బాగుండేది, అంతేకాని ఇక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.ఎవ్వడి దగ్గర వంగకుండా ఎవ్వడిని దేహి అనీ ఆడుకోకుండా ఈ మాట చెప్తే బాగుండేది ఏమో అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.సార్ పార్టీ ఒక్క స్థానం లో పోటీ చేస్తే ఒకవేళ ఆ గెలిచిన ఒక అభ్యర్థి పోటీని కూడా 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచారు అనే అంటారు, కానీ ఒక సంస్థాగత స్థాయి లో పార్టీ అని చెప్పడం ఒక్క మన పార్టీ మాత్రమే చెల్లింది ఏమి హైప్ ఇస్తుంది సార్ పార్టీ, ఏపి ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు.

టీమిండియా మీకులాగా కల్తీ కాదంటూ మరో నెటిజన్ ఘాటు కామెంట్స్ చేశాడు.నీ కంటే వెర్రోడు లేడోయి నాగబాబు. ఇండియా అన్ని మ్యాచ్ లు గెలిచింది. గెలవగలిగే మ్యాచ్ లు మాత్రమే ఆడి ఉండింటే అప్పుడు మీ పార్టీ తో పోల్చుకోవచ్చు. ఎక్కడైతే మన కులపు ఓట్లు ఎక్కువన్నాయో అక్కడ మాత్రమే ఒక 21 సీట్లు గెలుచుకోడం ఎలా ఉందంటే ఇండియా నేపాల్ తో గెలిచి గొప్ప చెప్పుకున్నట్లుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా క్రికెట్ ఫ్యాన్స్ నాగబాబు చేసిన ట్వీట్‌కు ఘాటు రిప్లైలు ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+