జూనియర్ NTRపై విమర్శలు.. స్పందించిన తారక్
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికగా తన యాసను విమర్శించిన వారికి జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా సమాధానం ఇచ్చారు ఒక్కో దేశంలో ఒక్కో యాస ఉండటం సహజమని, కాలమానం, యాసల పరంగానే మన మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చన్నారు. కానీ పశ్చిమ దేశాల్లో ఒక నటుడు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో తూర్పు దేశాల్లోనూ అదే విధంగా ఉంటుందన్నారు. 'నాటునాటు' గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఓ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించారు.
ఇదే ఇంటర్వ్యూలో ఆయన రాజమౌళి గురించి మాట్లాడారు. తన సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించిన వ్యక్తి అని, ప్రతి సినిమాకు ఆయన మరింత వృద్ధి చెందుతున్నారన్నారు. రాజమౌళి చాలా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పశ్చిమ దేశాల్లో కూడా పేరు వచ్చేందుకు ఆయన చేసిన ఆలోచనే 'ఆర్‌ఆర్‌ఆర్' అన్నారు. దక్షిణ భారతదేశంలో టాలీవుడ్ అనే చిన్న పరిశ్రమకు చెందినవారిమని మేము.. 'ఆర్‌ఆర్‌ఆర్' కారణంగా ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం, గ్లోబల్ సినిమాగా పేరు రావడం ఆనందంగా ఉందన్నారు.

రాజమౌళి తెరకెక్కించిన RRR గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టడంతోపాటు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరినీ లరించింది. ఈ చిత్రంలోని 'నాటు నాటు'కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్‌ను రెడ్ కార్పెట్‌పై ఓ హాలీవుడ్ యాంకర్ ఇంటర్వ్యూ చేశారు. దీనికి జూనియర్ బదులిస్తూ అమెరికన్ ఇంగ్లిష్ యాక్సెంట్‌లో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications