పెళ్ళి పత్రికలో ఆమె పేరు లేదని డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన బ్యాంకు అధికారులు..ఏమైందంటే
వివాహ పత్రికలో తన పేరు లేదనే సాకుతో బ్యాంకు ఖాతాలో తనపేరున ఉన్న డబ్బులను ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారని తిరుపతికి చెందిన జయంతి అనే మహిళ ఆవేదన చెందుతోంది. భర్త చనిపోవడంతో ఆమె పేరును వి
తిరుపతి:పెద్ద నగదు నోట్ల రద్దుతో వివాహాలపై పడింది. దీని ప్రభావంతో వివాహం కోసం బ్యాంకుల నుండి రెండున్నర లక్షల నగదును డ్రా చేసుకొనే అవకాశాన్ని ఆర్ బి ఐ అనుమతి ఇచ్చింది.అయితే చిన్నకారణంగా తిరుపతిలో వవాహానికి బ్యాంకులో ఉన్న డబ్బును డ్రా చేసుకొనేందుకు బ్యాంకు అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదు.
తిరుపతికి చెందిన జయంతి తన రెండో కుమారుడి 9వ, తేదిన వివాహం చేయాలని నిర్ణయించారు. వివాహనికి సంబందించి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. అదే సమయంలో పెద్ద నగదు నోట్ల రద్దు ఆమెకు పిడుగుపాటుకు గురిచేసింది. దీని కారణంగా బ్యాంకులో ఉన్న 2.89 లక్షల రూపాయాలను ఎలా డ్రా చేసుకొవాలనే విషయమై ఇబ్బంది పడింది.అయితే వివాహాలకు బ్యాంకుల నుండి డ్రా చేసుకొనే అవకాశాన్ని ఆర్ బి ఐ ఇచ్చింది. వివాహానికి సంబంధించిన పత్రికను చూపితే డ్రా చేసుకొనే వెసులుబాటు కల్పించింది.

ఆర్ బి ఐ కల్పించిన వెసులుబాటు కారణంగా తమ కుమారుడి వివాహం నిర్వఘ్నంగా సాగుతోందని ఆమె భావించింది. అయితే ఈవివాహానికి బ్యాంకు అధికారుల నుండి అడ్డంకులు ఏర్పడ్డాయి. బ్యాంకులో జయంతి పేరున అకౌంట్ ఉంది. అయితే వివాహ పత్రికలో మాత్రం ఆమె పేరు లేదు.దీని కారణంగా బ్యాంకు అధికారులు ఆమెకు రెండున్నర లక్షల నగదును ఇచ్చేందుకు నిరాకరించారు.
అందరూ ఖాతాదారులకు ఇచ్చినట్టుగానే పదివేల రూపాయాలను మాత్రమే ఇస్తామని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు.జయంతి భర్త చనిపోయాడు. ఈ కారణంగా వివాహ పత్రికలో తన పేరుకు బదులుగా తన పెద్ద కుమారుడు, కోడలు పేరును అచ్చువేయించానని ఆమె చెబుతోంది.వివాహ పత్రికలో తన పేరు లేని కారణంగా బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications