మరో తుఫాను ముప్పు, ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం - తాజా హెచ్చరికలు..!!
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. మొంథా తుఫాను మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే మరో తుఫాను దూసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతా వరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. ఇదే సమయం లో వాతావరణ శాఖ తాజా అంచనాలను వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో.. తెలంగాణ లోని పలు జిల్లాల్లో రానున్న పది రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.
వాతావరణ శాఖ మరో తుఫాను పైన అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనా లు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీని కంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసి, ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దక్షిణ భారతంపైకి చలిగాలులు వీస్తుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలితీవ్రత పెరిగినట్లు వెల్లడించారు .పాడేరు ఏజెన్సీ ప్రాంతాల తో పాటుగా తెలంగాణ కు ఆనుకుని ఉన్న మధ్యకోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రత లు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జి.మాడుగులలో 11.6, వజ్రకరూర్‌లో 11.8, అనంతపురంలో 15.5, ఆరోగ్యవరంలో 16, నందిగామ, జంగమహే శ్వర పురంలలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయవ్య, మధ్య, ఉత్తర భారతంలో కొనసాగుతున్న చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల చలి గాలులు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. కాగా, తుఫాను అవకాశం పైన వాతావరణ శాఖ తాజా అంచనాలతో అధికార యంత్రాంగం తుఫాను కదలికల పైన అప్రమత్తం అయింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications