Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Michaung:ఏపీలో భారీ వర్షాలు.. విధ్వంసం సృష్టిస్తోన్న మిఛౌంగ్ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మంగళవారం సాయంత్రానికి బాపట్ల- మచిలీపట్నం మధ్య, బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వేగం కొద్దిగా మందగించింది. ఇదివరకు గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదలగా.. ఇప్పుడు 12 కిలోమీటర్లకు పరిమితమైనట్లు ఐఎండీ పేర్కొంది. మిఛౌంగ్ తుపానుకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Cyclone Michaung live updates in telugu:Heavy rains in AP,govt on alert

Dec 06, 2023, 8:54 am IST
ఆంధ్రప్రదేశ్

అంధకారంలో జిల్లాలు

మిఛౌంగ్ ప్రభావంతో విద్యుత్ సరఫరా లేక అంధకారంలోకి పోయిన ప్రకాశం, నెల్లూరు,బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలు
Dec 05, 2023, 4:05 pm IST

తీరం దాటనున్న తుపాను

కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు
Dec 05, 2023, 4:04 pm IST

కాసేపట్లో బాపట్ల దగ్గర తీరం దాటనున్న మిచౌంగ్ తుపాను
Dec 05, 2023, 3:30 pm IST
ఆంధ్రప్రదేశ్

రాజంపేట నియోజకవర్గ పరిధిలో తుఫాను ప్రభావం

Cyclone destroys banana crop
రాజంపేట,ఒంటిమిట్ట,సిద్దవటం పరిధిలో గాలి వానకు భారీగా కూలిన అరటి,బొప్పాయి,మామిడి
Dec 05, 2023, 3:28 pm IST
ఆంధ్రప్రదేశ్

ఎగిసిపడుతున్న అలలు

బాపట్ల సూర్యలంక తీర ప్రాంతంలో సముద్ర అలలు రెండు మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి
Dec 05, 2023, 12:42 pm IST
ఆంధ్రప్రదేశ్

తిరుమల

తిరుమల ఘాట్‌రోడ్డులో వర్ష బీభత్సం. ఇబ్బందులు పడుతున్న భక్తులు
Dec 05, 2023, 12:31 pm IST
ఆంధ్రప్రదేశ్

తిరుపతి

Bhumana Karunakar Reddy
తుపాను సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించిన భూమన
Dec 05, 2023, 12:29 pm IST
ఆంధ్రప్రదేశ్

తిరుపతి

Michaung cyclone
వరద బాధితులకు అండగా నిలుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్న భూమన కరుణాకర రెడ్డి
Dec 05, 2023, 12:24 pm IST
ఆంధ్రప్రదేశ్

పలు విమానాలు రద్దు

విశాఖ నుంచి 23 ఇండిగో విమానాలు రద్దు.తుపాను కారణంగా విశాఖ నుంచి 23 ఇండిగో విమానాలు రద్దు:ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌
Dec 05, 2023, 12:08 pm IST
ఆంధ్రప్రదేశ్

బాపట్ల తీరానికి చేరుకున్న జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు. వచ్చే మూడు గంటల్లో తుఫాన్ ఇక్కడే తీరం దాటుతుందని అంచనా వేసిన వాతావరణ కేంద్రం.
Dec 05, 2023, 11:57 am IST
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి. అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు.
Dec 05, 2023, 11:48 am IST
తమిళనాడు

తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన చెన్నై సిటీ. పెరుంగుడిలో అత్యధికంగా 45 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు వెల్లడించిన ఐఎండీ
Dec 05, 2023, 11:37 am IST
ఆంధ్రప్రదేశ్

24 గంటల వ్యవధిలో బాపట్ల, నెల్లూరుల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపిన భారత వాతావరణ కేంద్రం.
Dec 05, 2023, 11:32 am IST
తమిళనాడు

భారీ వర్షాల వల్ల నీట మునిగిన చెన్నైలోని వెస్ట్ తాంబరం సీటీఓ కాలనీ, శశివర్ధన్ నగర్ నుంచి స్థానికులను బోట్లపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న సహాయక సిబ్బంది.
Dec 05, 2023, 11:27 am IST
ఆంధ్రప్రదేశ్

మిఛౌంగ్ తుఫాన్ ఇంకో నాలుగు గంటల్లో బాపట్ల వద్ద తీరాన్ని తాకుతుందని వెల్లడించిన విశాఖపట్నం సైక్లోన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సునంద
Dec 05, 2023, 11:22 am IST
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూలవాని గుంట, గొల్లవాని గుంటలో పర్యటించిన ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
Dec 05, 2023, 11:09 am IST
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.
Dec 05, 2023, 10:47 am IST
ఆంధ్రప్రదేశ్

మిఛౌంగ్ తుఫాన్ ధాటికి కురుస్తోన్న భారీ వర్షాల వల్ల తిరుమలలో గరిష్ఠస్థాయికి చేరుకున్న పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార రిజర్వాయర్లు
Dec 05, 2023, 9:50 am IST
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు

Cyclone Michaung
భారీ వర్షాలకు అతలాకుతలమైన నెల్లూరు పోస్టాఫీస్ సెంటర్
Dec 05, 2023, 9:41 am IST
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షసూచన

కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం..
Dec 05, 2023, 9:40 am IST
ఆంధ్రప్రదేశ్

బలమైన గాలులు

తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు
Dec 05, 2023, 9:36 am IST
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

మధ్యాహ్ననంలోపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్
Dec 05, 2023, 9:35 am IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుఫాన్
Dec 05, 2023, 9:35 am IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్.ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుఫాన్
Dec 05, 2023, 9:29 am IST
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం,విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఎల్లో అలర్ట్
Dec 05, 2023, 9:28 am IST
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

నెల్లూరు, కడప, తూ.గో., కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Dec 05, 2023, 9:27 am IST
ఆంధ్రప్రదేశ్

నీట మునిగిన పంటపొలాలు

భారీ వర్షాలకు మచిలీపట్నంలో నీటమునిగిన పంటపొలాలు
Dec 05, 2023, 9:26 am IST

బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో. ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్
Dec 05, 2023, 9:25 am IST
ఆంధ్రప్రదేశ్

రెడ్ అలర్ట్

తుఫాన్ ప్రభావంతో ఏపీలో 9 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం రెడ్ అలర్ట్
Dec 05, 2023, 9:16 am IST
ఆంధ్రప్రదేశ్

దక్షిణ కోస్తా తీరం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిఛౌంగ్ తుపాను.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+