ఇవాళ అర్ధరాత్రి దాటితే విధ్వంసమే! మురసు ప్రళయరూపం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ అశాంతి కాస్తా.. ఇప్పుడు ప్రళయరూపు దాల్చింది. నిన్నటి వరకు సాధారణంగా కదిలిన వాయుగుండం, ఇప్పడు అత్యంత తీవ్రరూపం దాల్చి 'మురసు' తుపానుగా మారింది. సముద్రంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను, తీర ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఎటు చూసినా అలల తాకిడి పెరిగిపోవడంతో, తీర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కదులుతున్న ఈ తుపాను దూకుడు మామూలుగా లేదు. గంటకు దాదాపు 20 కిలోమీటర్ల వేగంతో ఇది వాయువ్య దిశగా పయనిస్తోంది. చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా, నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా సముద్రం మధ్యలో కదులుతూ క్షణక్షణం తన శక్తిని పెంచుకుంటోంది. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు గల తీర ప్రాంతాలన్నింటికీ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Cyclone Murasu Live Updates Winds Up to 120 kmph Likely School Closed in Coastal AP Districts

అర్ధరాత్రి దాటితే విధ్వంసమే!

ఇది నేరుగా వాయువ్య దిశగానే పయనించి నేడు అర్ధరాత్రి దాటాక దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. నెల్లూరు - నర్సాపురం మధ్య, ముఖ్యంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే ప్రమాదం పొంచివుంది. ఆ సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

ఈ తుపాను తీరం దాటే సమయంలో ప్రకృతి బీభత్సం సృష్టించేలా కనిపిస్తోంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు ఏకంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ భారీ గాలులకు చెట్లు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

Cyclone Murasu:బంగాళాఖాతంలో 'మురాసు’ విలయం. అత్యంత భారీ వర్షాలు
Cyclone Murasu:బంగాళాఖాతంలో 'మురాసు’ విలయం. అత్యంత భారీ వర్షాలు

తీర ప్రాంత ప్రజలకు హైఅలర్ట్

పరిస్థితుల తీవ్రతను గమనించిన యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి సమయంలో ముప్పు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

మురసు ప్రభావంతో నేడు కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

మళ్లీ తుఫాను.. ప్రచండ వేగంతో నేడు తీవ్ర వాయుగుండంగా మారి కుంభవృష్ఠి
మళ్లీ తుఫాను.. ప్రచండ వేగంతో నేడు తీవ్ర వాయుగుండంగా మారి కుంభవృష్ఠి

నేడు అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు

కృష్ణా, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.

భారీ వర్షాలు కురిసే జిల్లాలు

ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య

రేపు భారీ వర్షాలు..

మంగళవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+