'ఆది.. అంత మాట అంటావా?, రాజకీయ భవిష్యత్తు ఉండదు జాగ్రత్త!'
దళితుడైన డాక్టర్ ఎ.డి.అచ్చన్నను తన సిబ్బంది ఎదుటే మెంటల్ డాక్టర్ అని సంబోధించి కించపరిచాడని మండిపడ్డారు.
జమ్మలమడుగు: మంత్రి ఆదినారాయణ రెడ్డిపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఓ దళిత డాక్టరును మెంటల్ డాక్టర్ అంటూ మంత్రి సంబోధించడం వివాదం రేపుతోంది.
గతంలోను 'దళితులు శుభ్రంగా ఉండరు' అంటూ ఆదినారాయణ దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ డాక్టరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు దళిత సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి.

శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు పాత బస్టాండులో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రోడ్డుపై స్థానిక ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మంత్రి ఆదిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్టలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. దళితుడైన డాక్టర్ ఎ.డి.అచ్చన్నను తన సిబ్బంది ఎదుటే మెంటల్ డాక్టర్ అని సంబోధించి కించపరిచాడని మండిపడ్డారు.
మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు దళిత సంఘాల నాయకులు. ఇంతవరకు మంత్రి ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగులో దళితులు ఓట్లు వేసి గెలిపించారని, ఇకముందు ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ఇక అనంతపురం జిల్లా కదిరిలో ఒక గిరిజన మహిళ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడాన్ని కూడా వారు తప్పుపట్టారు. ఈ ఘటనలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications