వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిలువ వేసుకొని పీఠాధిపతులకు మ్రొక్కులా?: జగన్‌కు క్రిస్టియన్ల షాక్

వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్‌ ప్రాంతాలవారీగా మతం రంగు మార్చుకుంటున్నారని అఖిల భారత దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య సోమవారం విమర్శించింది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్‌ ప్రాంతాలవారీగా మతం రంగు మార్చుకుంటున్నారని అఖిల భారత దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య సోమవారం విమర్శించింది.

హద్దు మీరారు: 'జగన్ సెల్ఫ్ గోల్, అవే మైనస్', ఎవరో.. ఇప్పటికే క్లారిటీహద్దు మీరారు: 'జగన్ సెల్ఫ్ గోల్, అవే మైనస్', ఎవరో.. ఇప్పటికే క్లారిటీ

జగన్ మోసం చేస్తున్నారు

జగన్ మోసం చేస్తున్నారు

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించే దళిత క్రైస్తవులను, రెడ్డి, కమ్మ, కాపు, బీసీ కన్వర్టెడ్‌ క్రైస్తవులను జగన్‌ మోసం చేస్తున్నారంటూ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జెరూసలెం మత్తయ్య ప్రకటన విడుదల చేశారు.

Recommended Video

Nandyal by-elections : Chandrababu Naidu holds Road Show, Watch Video
శిలువ మెడలో వేసుకొని పుష్కర స్నానాలు, మొక్కులు

శిలువ మెడలో వేసుకొని పుష్కర స్నానాలు, మొక్కులు

పుట్టు క్రైస్తవుణ్ని అని చెప్పుకొనే జగన్‌ ఇటీవల హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు మెడలో శిలువ వేసుకునే పుష్కర స్నానాలు చేస్తున్నారని, పీఠాధిపతులకు మొక్కుతున్నారని, తన ఇంట్లో యజ్ఞాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వీరినే ప్రలోభ పెడుతున్నారేం

వీరినే ప్రలోభ పెడుతున్నారేం

తాజాగా నంద్యాల ఎన్నికల్లో హిందూ పూజారులను దూరంగా ఉంచి ముస్లిం, క్రైస్తవులను మాత్రమే ప్రలోభ పెడుతున్నారన్నారు. నంద్యాల ఓటర్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని దళిత క్రైస్తవులు, మైనార్టీలు విజ్ఞతతో ఉండాలని పేర్కొన్నారు.

నంద్యాల ఉప ఎన్నికలకు సిద్ధం

నంద్యాల ఉప ఎన్నికలకు సిద్ధం

కాగా, కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉపఎన్నికకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని అన్ని కేంద్రాలకు పోలింగ్‌ సామాగ్రి తరలి వెళ్లింది. పోలింగ్‌ సిబ్బంది సహా దాదాపు ఆరు వేల మంది ఎన్నికల విధుల్లో పాలు పంచుకుంటున్నారు. బుధవారం ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

255 నియోజకవర్గాల్లో

255 నియోజకవర్గాల్లో

నియోజకవర్గంలోని 255 పోలింగ్‌ కేంద్రాల్లో 144 కేంద్రాలను అత్యంత సమస్మాత్మకంగా, 71 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. నియోజకవర్గం మొత్తం దాదాపు సమస్యాత్మకంగా ఉండటంతో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పారామిలటరీ బలగాలకు అప్పగించనున్నారు. ఇప్పటికే 6 కంపెనీల కేంద్ర పోలీస్‌ బలగాలు నంద్యాలకు చేరుకున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ వెబ్ క్యాస్టింగ్‌ సిబ్బంది సహా మొత్తం 10మంది విధులు నిర్వహించనున్నారు.

English summary
Dalit Christian leaders fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy for wooing christians and muslim voters in Nandyal bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X