కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకాపై తొలి వేటు ఆయనదే-కుక్కను చంపి-బూతులు తిట్టి- గొడ్డలి వేట్లు- దస్తగిరి సంచలనం

|
Google Oneindia TeluguNews

ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో క్రమంగా తేలిపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే హంతకులు, హత్య జరిగిన విధానం ఇప్పటికే దాదాపుగా బయటికి రాగా.. ఇప్పుడు సరిగ్గా హత్య జరిగిన తీరు, అంతకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు కూడా వెలుగుచూశాయి. వివేకాను హంతకులు హత్యకు ముందు బూతులు తిడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ ఎలా గొడ్డళ్లతో నరికేశారో కళ్లకు కట్టినట్లు ఆయన మాజీ కారు డ్రైవర్, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తాజా వాంగ్మూలంలో వెల్లడించాడు.

వివేకా హత్యకు కారణాలు

వివేకా హత్యకు కారణాలు


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన మాజీ కారు డ్రైవర్ దస్తగిరి సీబీఐకి తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో మరిన్నివివరాలు వెల్లడించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి తర్వాత హైదరాబాద్ వెళ్లి జగన్ ను కలిసి వచ్చారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి సన్నిహితుడైన శివశంకర్ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించావ్.. నీ అంతు చూస్తా అని వివేకా హెచ్చరించారు. అక్కడే ఉన్న అవినాష్,భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిని కూడా వీడి మాటలు విని మీరూ నన్ను మోసం చేశారు. మీ కథ కూడా తేలుస్తా అన్నారు. 2017 నుంచి జరుగుతున్నఓ ల్యాండ్ సెటిల్ మెంట్ లో గజ్జల జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డికి తోడయ్యారు. ఈ సెటిల్ మెంట్ పూర్తయ్యాక వివేకా బెంగళూరు యలహంక గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు గంగిరెడ్డి వాటా అడిగాడు. దీనిపైనా వివేకా ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటి నుంచి గంగిరెడ్డికీ, వివేకాకూ చెడింది. ఆ తర్వాత దస్తగిరి కూడా డ్రైవర్ గా మానేశాడు. అనంతరం గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి అంతా ఏకమయ్యారు. వైఎస్ కుటుంబం సభ్యులతో వీరు కలిశారు.

వివేకా హత్యకు కుట్ర ఇలా

వివేకా హత్యకు కుట్ర ఇలా


ల్యాండ్ సెటిల్ మెంట్ లో తనకు వాటా ఇవ్వని వివేకాపై కక్ష పెంచుకున్న గంగిరెడ్డి.. తనకు సన్నిహితులైన ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిని పిలిచి కుట్రకు తెరలేపారు. ముందుగా వివేకాను చంపాలని ఆయన మాజీ డ్రైవర్ అయిన దస్తగిరికి గంగిరెడ్డి చెప్పాడు. తానెలా చంపుతానని అడిగితే మేమంతా ఉంటామని చెప్పాడు. మన వెనుక అవినాష్, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నారన్నారు. సహకరిస్తే లైఫ్ సెటిల్ చేస్తామన్నారు. దీంతో దస్తగిరి ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా వివేకా హత్య ఎలా చేయాలన్న దానిపై ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టారు.

 కుక్కను చంపేసి

కుక్కను చంపేసి

వివేకా ఇంట్లోకి ఎంటరయ్యేందుకు అడ్డంకి అయిన కుక్కను చంపాలని నిర్ణయించుకున్న గంగిరెడ్డి.. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి సాయంతో అంతమొందించాడు. గంగిరెడ్డి.. దస్తగిరికి 75 లక్షలు ఇచ్చి సునీల్ యాదవ్ కు 25 లక్షలు ఇచ్చాడు. వివేకా పీఏ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి వాచ్ మెన్ రాజశేఖర్ లేని సమయంలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి కారుతో తొక్కించి కుక్కను చంపేసారు.దీంతో వివేకా ఇంట్లోకి వెళ్లేందుకు అడ్డంకుల్లేకుండా పోయాయి. ఆ తర్వాత 2019 మార్చి 13 నుంచి మూడు రోజుల పాటు వాచ్ మెన్ రాజశేఖర్ కాణిపాకం వెళ్తున్నాడని తెలుసుకుని హత్యకు మార్చి 14న ముహుర్తం ఫిక్స్ చేశారు.

వివేకా ఇంట్లోకి ఎంటరైంది ఇలా..

వివేకా ఇంట్లోకి ఎంటరైంది ఇలా..

మార్చి 14న వివేకానందరెడ్డి హత్యకు సిద్ధమైన హంతకులు.. రాత్రి 11.45 తర్వాత ఇంట్లోకి ఆయన కారు వెళ్లడం చూసి పరస్పరం ఫోన్ లు చేసుకుని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దస్తగిరి కొన్న గొడ్డలిని తీసుకుని అక్కడికి వెళ్లాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో కలిసి రాత్రి వరకూ మద్యం తాగిన దస్తగిరి.. రాత్రి 1.30 తర్వాత ఇంట్లోకి ఎంటరయ్యారు. డోర్ కొట్టగా. లోపల వివేకాతో కలిసి ఉన్న గంగిరెడ్డి తలుపు తీశాడు. వివేకాకు అనుమానమొచ్చి ప్రశ్నిస్తే ల్యాండ్ సెటిల్ మెంట్ డబ్బుల కోసం వచ్చారని చెప్పారు. ఆ తర్వాత ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో తమకు డబ్బులివ్వలేదంటూ గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వివేకాను బూతులు తిట్టడం మొదలుపెట్టారు. సునీల్ యాదవ్.. వివేకా ముఖం మీద బలంగా కొట్టాడు.

వివేకాపై గొడ్డలి వేటు వేసింది అతనే..

వివేకాపై గొడ్డలి వేటు వేసింది అతనే..

ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి కి దస్తగిరి గొడ్డలి అందించాడు. దాంతో వివేకా తలపై ఉమాశంకర్ రెడ్డి తొలి వేటు వేశాడు. ఆ తర్వాత తల వెనుక వేటు వేశారు. సునీల్ యాదవ్ వివేకా ఛాతీ మీద 15 సార్లు కొట్టాడు. ఆ తర్వాత వివేకాను మోకాళ్లపై కూర్చోబెట్టి ఓ లెటర్ రాయించాలని నిర్ణయించుకున్నారు. ల్యాండ్ సెటిల్ మెంట్ కు సంబంధించి డాక్యుమెట్లు వెతికారు. దొరకలేదు. దీంతో ఈ లెటర్ లో తమ పేరుతో ఆస్తి రాయించుకుందామని అనుకున్నారు. కానీ వివేకా రాయలేదు. దీంతో రాస్తే వదిలేస్తాం లేదంటే చంపేస్తామన్నారు. చివరికి నా డ్రైవర్ ప్రసాద్ డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చంపబోయాడు. అతన్ని వదిలిపెట్టొద్దంటూ వివేకాతో రాయించారు.

Recommended Video

YS Vivekananda Reddy కేసులో YS Jagan ని విచారించాలని TDP డిమాండ్| YSRCP | Oneindia Telugu
బాత్రూమ్ లోకి తీసుకెళ్లి దారుణంగా

బాత్రూమ్ లోకి తీసుకెళ్లి దారుణంగా

ఆ తర్వాత బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి చంపేద్దామని గంగిరెడ్డి చెప్పగా.. మిగతా వాళ్లు లాక్కెళ్లారు. అక్కడ వివేకా తలపై ఉమాశంకర్ రెడ్డి నాలుగైదు గొడ్డలి పోట్లు వేయగా.. సునీల్ యాదవ్ వివేకా మర్మాంగం మీద తన్నాడు. దీంతో వివేకా ప్రాణం పోయినట్లు తెలుసుకున్న వీరు.. తదుపరి ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. ఆ తర్వాత గంగిరెడ్డి ముందుగా పారిపోయాడు. వాచ్ మెన్ రంగన్న ఎవరు ఎవరని ప్రశ్నిస్తుండగానే మిగిలిన వారు గోడ దూకి పారిపోయారు. ఆ తర్వాత రాజారెడ్డి ఆస్పత్రికి వెళ్లి కాళ్లు ముఖంపై రక్తపు మరకలు కడుక్కున్నట్లు దస్తగిరి వెల్లడించాడు. ఆ తర్వాత మిగతా నిందితులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంపై తనను బెదిరిస్తున్నట్లు దస్తగిరి తెలిపాడు.

English summary
ys vivekanadareddy's former car driver dastagiri revelead actual plot happened in his second statement before court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X