11న కూతురు ఎంగేజ్‌మెంట్: రేవంత్ రెడ్డి బెయిల్‌పై ఆశలు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ నెల 11వ తేదీన రేవంత్ రెడ్డి కూతురు ఎంగేజ్‌మెంట్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లోగా ఆయనకు బెయిల్ రావచ్చని అంటున్నారు.
రేవంత్ కూతురుకు కాబోయే వరుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకుడిగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి దూకుడుగా పోయే, యువ రాజకీయ నాయకుడు. రేవంత్‌ను చూస్తే అతనికి పెళ్లి ఈడుకు వచ్చిన కూతురు ఉందా అని అనిపించకమానదు.

గత నెల 27వ తారీఖు నుండి 29 తారీఖు వరకు మహానాడు బిజీలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత తన కూతురు పెళ్లి పనులతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంతో బిజీబిజీగా గడిపారు. అంతలోనే అనుకోని విధంగా పట్టుబడి, జైలుకు వెళ్లారు.
రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు, రేవంత్ కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు బెయిల్ తప్పకుండా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ కేసులో వాదించేందుకు తెరాస ప్రభుత్వం సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది.












Click it and Unblock the Notifications