నాగబాబుకు మంత్రి పదవి డౌటేనా - కీలక పరిణామాలు..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అటు కేంద్రం జమిలి ఎన్నికల దిశగా కసరత్తు వేగ వంతం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. అటు వైసీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పోరుబాట మొదలు పెట్టింది. జగన్ ను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే చంద్రబాబు నిర్ణయంతో కూటమి పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ నాగబాబు కేబినెట్ లో చేరేది ఎప్పుడు. ఏం జరుగుతోంది.

చంద్రబాబు ప్రకటనతో
నాగబాబుకు లోక్ సభకు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ జస్ట్ మిస్ అయింది. రాజ్యసభ ఖాయం అను కుంటే అదీ దక్కలేదు. దీంతో, రాజ్యసభ సభ్యులను ఖరారు చేసే సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తన మంత్రివర్గం కూర్పు సమయంలో ఒక స్థానం ఖాళీ ఉంచారు. కూటమి ప్రభుత్వం కావటంతో భవిష్యత్ రాజకీయ సమీకరణాలు - అవసరాల కోసం ఆ బెర్తు పెండింగ్ ఉంచారు. బీజేపీకి ఆ స్థానం దక్కుతుందనే అంచనాలు వినిపించాయి. అయితే, రాజ్యసభ సీట్ల ఖరారులో చోటు చేసు కున్న పరిణామాలతో ..అనూహ్యంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

Decision over Inducts Nagababu into cabinet leads to new discussion in TDP and Janasena

పవన్ ఆలోచన ఏంటి
అయితే, నాగబాబు పేరు చంద్రబాబు ప్రకటన చేసిన సమయం నుంచి పలు రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. జనసేనకు ప్రస్తుతం పవన్ తో పాటుగా ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన నుంచి బీసీ వర్గాలకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు పెండింగ్ స్థానం జనసేనకు ఇస్తే బీసీ వర్గానికి ఇస్తే బాగుంటుందనే చర్చ జనసేన మద్దతు దారుల్లో వినిపిస్తోంది. అదే విధంగా నారా - మెగా కుటుంబాలకు కూటమి ప్రభుత్వంలో పదవులు దక్కటం.. నందమూరి కుటుంబానికి పదవులు ఇవ్వకపోవటం పైనా చర్చ కొనసాగుతోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య కు మంత్రి పదవి ఇవ్వకుండా ..ఇప్పుడు నాగబాబు కు ఇవ్వటం ఏంటనే చర్చ సోషల్ మీడియా కేంద్రంగా సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీలోనూ ఆసక్తి కర చర్చ మొదలైంది.

స్పష్టత ఇచ్చేలా
ఈ సారి మంత్రివర్గంలో టీడీపీ నుంచి పలువురు సీనియర్లకు ఆశావాహులకు స్థానం దక్కలేదు. నాగబాబుకు మంత్రి పదవి పై పవన్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. కూటమి అధికారంలోకి వచ్చే సమయంలో కుటుంబ రాజకీయాల పై పవన్ విమర్శలు చేసారు. ఇప్పుడు తిరిగి నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవటం కొత్త విమర్శలకు కారణం అవుతుందనే చర్చ వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబుకు అవకాశం పై ప్రకటన చేయటంతో ఈ నిర్ణయం నుంచి వెనక్కు తీసుకునే అవకాశం లేదని.. మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం టీడీపీ - జనసేనలో జరుగుతున్న చర్చ పైన రెండు పార్టీల అధి నాయకత్వం ఆరా తీస్తోంది. దీని పైన చంద్రబాబు - పవన్ ఎలా ముందుకు వెళ్తారనే అంశం పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+