Pawan Kalyan: ప్రముఖ నటుడి మృతి పట్ల సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్..

ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ మృతి పట్ల డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. " ప్రముఖ తమిళ నటుడు తిరుడిల్లి గణేష్ అవల్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అతని అద్భుతమైన నటనా జీవితం, 400 చిత్రాలతో భారతీయ సినిమాకి అందించిన సహకారం ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసింది. భారత వైమానిక దళంలో అతని మునుపటి సేవ దేశం పట్ల అతని అభిరుచి, దేశభక్తిని ప్రదర్శిస్తుంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతా చేకురాలి" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ గణేష్ ఎన్నో సినిమాల్లో అలరించారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమంలో విషాదం నెలకొంది. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ గణేష్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన తమిళ్, తెలుగు, కన్నడ భాషాల్లో నటించారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గణేష్ భౌతికఖాయం రామాపురంలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.

Delhi Deputy CM Pawan Kalyan expressed grief over the death of Delhi Ganesh

సాయంత్రం ఆయన సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లీ గణేష్ 1944 లో జన్మించి.. 1964లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. 1974 వరకు అక్కడే పని చేసి మానేశారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తమిళ, సీరియల్స్, సినిమాల్లో నటించారు. సినీ పరిశ్రమలోకి రాకముందు ఢిల్లీకి చెందిన థియేటర్ ట్రూప్ యాక్టింగ్ చేశాడు. అక్కడ గణేష్ ను చూసిన కె. బాలచందర్ అవకాశం ఇచ్చాడు. 1976లో తన వచ్చిన పట్టిన ప్రవేశం సినిమాలో గణేష్ కు అవకాశం కల్పించారు.

అక్కడి నుంచి ఆయన అనేక సినిమాల్లో నటించారు. 400 సినిమాల్లో యాక్టింగ్ చేశారు. ఢిల్లీ థియేటర్ ట్రూప్ పని చేయడంతో కె. బాలచందర్ అతనికి ఢిల్లీ గణేష్ అని పేరు పెట్టారు. ఢిల్లీ గణేష్ మైఖేల్ మదన కామ రాజన్, ఆహా, అపూర్వ సగోధరార్గళ్, సింధు భైరవి , నాయకన్ , తెనాలి , ఎంగమ్మ మహారాణి వంటి హిట్ సినిమాల్లో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+