సంప్రదాయ బద్దంగా - శ్రీవారి సుప్రభాత సేవలో అన్నా లెజినోవా..!!
డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమ వారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడంతో శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందు కు తిరుమల వచ్చిన అన్నా లెజినోవా ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించారు.
ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు వచ్చారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేసిన ఆమె వరాహస్వామిని దర్శిం చుకున్నారు. అనంతరం శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా ఆలయ సాంప్రదాయంను పాటిస్తూ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న సమయం నుంచి ప్రతీ అడుగు లోనూ అన్నా లెజినోవా టీటీడీ సంప్రదాలను పూర్తగా అనుసరించారు. దేవుడికి హారతి ఇచ్చారు. కొబ్బరి కాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. సింగపూర్ లో తమ కుమారుడు గాయ పడి కోలుకోవటంతో తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకోవాలని అన్నా లెజినోవా నిర్ణయించి.. ఈ మేరకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

•కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు.
— JanaSena Party (@JanaSenaParty) April 14, 2025
•సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
•దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద… pic.twitter.com/KvVKjWh8A9
తన కుమారుడికి చికిత్స పూర్తి కావటంతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈనెల 8న సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్న కుమారుడు మార్క్ శంకర్ కాలికి, చేతులకు గాయాలు కావడంతో ఆయన సింగపూర్‌కు వెెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి కేకే మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు వైద్యం అందించారు.

ప్రధాని మోదీ పవన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటన గురించి తెలుసుకో వడంతో పాటు సింగపూర్‌లోని భారత హై కమిషనర్‌తో మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడ గా ఉందని పవన్ వెల్లడించారు. తన కుమారుడి క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో సందేశాలు, ప్రార్థనలు ఎంతో ధైర్యం ఇచ్చాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications