చంద్రబాబు అంత చెబుతారు కదా, ఏమైంది!: దేవినేని

పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు రుణమాఫీ చేయలేడా? అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకద్రోహం చేశారన్నారు. రుణమాఫీపై బాబు తన విధానం ఏమిటో రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అంత చేశామని, ఇంత చేశామని చెప్పుకునే బాబు రుణమాఫీ విషయంలో ఎందుకు విఫలం ఎందుకు అవుతున్నారన్నారు.
ఎన్డీయేపై రఘువీరా
రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించాలనే ఎన్డీయే ఆలోచన దేశానికి అత్యంత ప్రమాదకరమని ఏపీ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ పేదలను పూర్తిగా విస్మరించిందని చెప్పడానికి ఈ బడ్జెట్టే ఉదాహరణ అన్నారు.












Click it and Unblock the Notifications