చంద్రబాబే హీరో: జగన్ సినిమా సెటైర్లపై దేవినేని పవర్ పంచ్!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ సంధించిన సెటైర్లపై దేవినేని పవర్ పంచ్‌లు విసిరారు.
బుధవారం ఉదయం మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. మంగళవారం బెజవాడలో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భేటీపై నిప్పులు చెరిగారు. సినిమా కథ చెప్పిన జగన్.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా జగన్ సినిమా సెటైర్లను ప్రస్తావించిన దేవినేని.. తొలి రీల్లోనే జైలుకెళ్లిన జగన్ విలన్‌గా మారిపోయారన్నారు. చివరి రీల్లోనూ చంద్రబాబే హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పటికీ చంద్రబాబు హీరోనేనని అన్నారు. జగన్ కొంగజపం దీక్షలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.

ఏపీ అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్ నియోజకవర్గంలో చీనిచెట్లు, నిమ్మతోటలకు నీళ్లుఇచ్చామని, ఈ విషయం పులివెందుల ప్రజలను అడిగితే తెలుస్తుందని దేవినేని ఉమా చెప్పారు.
రాజకీయ చదరంగంలో జగన్ అతినీతి తిమింగలమే అని దేవినేని ధ్వజమెత్తారు. బెజవాడ భేటీలో వైయస్సార్ కాంగ్రెస్ చేసిన తీర్మానాలు చూస్తే ఆ పార్టీ డొల్లతనం బయటడిపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పేరెత్తడానికే జగన్ భయపడుతున్నారని దేవినేని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications