వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బియాస్ ట్రాజెడీ: మంత్రితో డిజిపి భేటీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

మండి: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల జాడ కోసం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి. మహేందర్ రెడ్డి, తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మతో మండిలో సమావేశమయ్యారు. మంగళవారంనాడు మండి చేరిన అనురాగ్ శర్మను ఆయన బాధితుల తల్లిదండ్రులతో సంఘటనా స్థలంలో మరోమారు పర్యటించారు.

మృతదేహాల వెలికితీత, బాధితులను ఆదుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక మీద డిజిపి అనురాగ్ శర్మతో పాటు స్థానిక కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులతో సమీక్షించారు. మృతుల కుటుంబ సభ్యులు తమ పిల్లల డెత్ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు.

దానికి మహేందర్ రెడ్డి స్పందించి స్థానిక జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను పిలిపించి అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేస్తున్న తరుణంలో డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడం బాగుండదని, మరో రెండు రోజుల్లో అందించే ఏర్పాటు చేస్తామని దినేష్ కుమార్ చెప్పారు.

ఇండో - టిబెట్ బోర్డర్ పోలీసు, ఆర్మీ, జాతీయ విపత్తు అధికారులు, గజ ఈతగాళ్లు, సీమ సురక్ష సిబ్బంది తదితరులతో తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ కలిసి చర్చించారు.

బియాస్ నది వద్ద మహేందర్ రెడ్డి

బియాస్ నది వద్ద మహేందర్ రెడ్డి

హైదరాబాదు విద్యార్థులు గల్లంతైన బియాస్ నది వద్ద సహాయక చర్యలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు.

పండోవి డ్యాం వద్ద మహేందర్ రెడ్డి

పండోవి డ్యాం వద్ద మహేందర్ రెడ్డి

పండోవి డ్యాం వద్ద భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతున్న తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి.

పండోవి డ్యాం వద్ద మహేందర్ రెడ్డి

పండోవి డ్యాం వద్ద మహేందర్ రెడ్డి

పండోవి డ్యామ్ వద్ద అధికారులతో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి చర్చించారు.

డిజిపితో మహేందర్ రెడ్డి

డిజిపితో మహేందర్ రెడ్డి

తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మతో లార్జీ డ్యాం వద్ద మాట్లాడుతున్న తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి

English summary
Telangana DGP Anurag sharma met Telangana transport minister Mahender Reddy at Mandi on Beas tragedy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X