వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టించుకోం: కిరణ్ మీద దినేష్ వ్యాఖ్యలపై డిగ్గీ సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Diggy challenges Dinesh Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే కిరణ్‌పై కోర్టులో కేసు వేయాలని సవాల్ చేశారు.

దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలను పట్టించుకునే ప్రసక్తే లేదన్నారు. దినేష్ రెడ్డికి నిజాయితీ ఉంటే డిజిపిగా ఉన్నప్పుడే ఈ విషయలను వెళ్లడిస్తే బాగుండేందని, పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు పదవీ కాలాన్ని పొడిగించనందుకు కోపంతో ఇలా ఆరోపణలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు.

చట్టపరంగా వెళ్తాం: పితాని ధ్వజం

ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన దినేష్ రెడ్డిపై పలువురు మంత్రులు కూడా మండిపడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి అతనికి లేదని మంత్రి పితాని సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు అన్నారు. ఆయనపై చట్టపరంగా కూడా వెళ్తామని, ఆయనకు సమాధానం చెప్పేందుకు అనేక మంది ఐపిఎస్‌లు కూడా ఉన్నారని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు.

కేవలం తనకు డిజిపిగా పొడిగింపు ఇవ్వనందుకే దినేష్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 33 సంవత్సరాలు ఎఎస్‌పి నుంచి డిజిపి వరకు వివిధ స్థాయిల్లో పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావని విమర్శించారు. తనకు పొడిగింపు రాకుండా కిరణ్ కుట్ర చేశారన్న దినేష్ వ్యాఖ్యలపై ఆనం స్పందిస్తూ దినేష్ రెడ్డిని డిజిపిగా నియమించిన సమయంలో ఆయనకన్నా నందన్, గౌతమ్‌కుమార్, శివశంకర్, ఉమేష్ కుమార్‌లు సీనియార్టీ కలిగి ఉన్నారని, అయితే రెండేళ్లపాటు పదవిలో ఉండే వ్యక్తిని నియమిస్తే బాగుంటుందన్న భావనతో నలుగురిని పక్కన పెట్టి దినేష్‌కు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.

దినేష్ రెడ్డికి మతి భ్రమించింది: జగ్గా రెడ్డి

దినేష్ రెడ్డికి మతిభ్రమించిందని అసెంబ్లీలో ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలని ముఖ్యమంత్రి తనను ఆదేశించారని దినేష్ రెడ్డి చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ ఆ విధంగా చెప్పరని అన్నారు. దినేష్ రెడ్డి పదవీ కాలం పొడిగింపు రాకపోవడంతో ఈ విధంగా ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు.

English summary
AP Congress Party incharge Digvijay Singh on Tuesday challenged former DGP Dinesh Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X