పవన్ కల్యాణ్‌కు షాక్.. వైసీపీకి మద్దతుగా దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజుకు మంచి గుర్తింపు ఉంది. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు తరువాత నిర్మాతగా మారారు. తొలి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నారాయన. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్లతో సినిమాలు చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు.
అయితే దిల్ రాజు తన సినిమాలతో పాటు, వరుస వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు ఆయన మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వినిపించాయి.హనుమాన్ సినిమాకు అనుకున్నంతగా స్థాయిలో థియోటర్లు లభించలేదు. దీనిపై దిల్ రాజును కొందరు టార్గెట్ చేసుకుని కొందరు విమర్శలకు దిగారు. గుంటూరు కారం సినిమాను నైజంలో దిల్ రాజు విడుదల చేయడం వల్లనే హనుమాన్‌కు థియోటర్లు ఇవ్వడం లేదనే ప్రచారం జరిగింది.

దీనిపై దిల్ రాజుపై మండిపడ్డారు. ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని.. ఇకపై తనపై తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్‌ల తాటతీస్తానని దిల్ రాజు హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఆయన ఏపీలో జరిగే ఎన్నికలపై ఆయన తాజాగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి తన మద్దతు ప్రకటించారాయన.బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను దిల్ రాజు కోరారు.
బాలినేని వాసు అన్న మంచి వాడు -Producer Dil Raju#YSJaganAgain #DilRaju #MemanthaSiddhamYatra pic.twitter.com/oLXzp7kZcl
— The Rise Of YSJagan (@TheRiseOfYSJ) April 24, 2024
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగొలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. బాలినేని రాజకీయ ప్రస్థానంపై ఒక డాక్యుమెంటరీ రూపొందించాను. అది అందరూ చూడాలని దిల్ రాజు వెల్లడించారు.బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశానన్న దిల్ రాజు ఆయనను గొప్ప నేతగా అభివర్ణించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ ప్రాంత అభివృద్ధికి బాలినేని పాటుపడ్డాడని దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications