bad luck: సలార్ రైట్స్ కొనడంలో డిస్ట్రిబ్యూటర్ల వెనకడుగు?

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అన్ని భాషల చిత్ర పరిశ్రమలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చిత్రం ఏదన్నా ఉందా అంటే.. అది సలార్. మోస్ట్ అవైటెడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ ప్రేక్షకులతోపాటు ప్రభాస్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 1, 2 భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న చిత్రం కావడం ప్రధాన కారణం. డార్లింగ్ కు బాహుబలి తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. దీని తర్వాత విడుదలవుతున్న సలార్ తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనే నమ్మకాన్ని డార్లింగ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను హోంబలే ఫిలింస్ నిర్మించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ 1, 2 కూడా ఈ సంస్థే నిర్మించింది. సలార్ సినిమా హక్కులు కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్ల నుంచి, బయ్యర్ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంటుందని భావించారు. అయితే వాస్తవ పరిస్థితిని చూస్తే సలార్ హక్కులు కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. నిర్మాతలు హక్కులు ఎక్కువగా చెబుతున్నారు. దీంతో వారు వెనకడుగు వేస్తున్నారు. ప్రభాస్ సినిమాలు వరుసగా మూడు ఫ్లాప్ కావడంతో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.

salar

ప్రభాస్ నుంచి సినిమా అంటే బాహుబలి స్థాయిలోనే ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. ఆ స్థాయిని అందుకోలేక మిగతా సినిమాలన్నీ చతికిలబడుతున్నాయి. వరుసగా మూడు సినిమాలతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ధర తగ్గించాలని, గత నష్టాలను పూడ్చుకునే అవకాశం కూడా ఇవ్వాలని హోంబలే ఫిలింస్ ను కోరుతున్నారు. బయ్యర్లు మాత్రం ఆలోచనలో పడ్డారు. నిర్మాత మాత్రం సినిమాపై విజయం ఖాయమనే నమ్మకంతో ఎక్కువే డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీని కొనడానికి వెనకడుగు వేయడమనేది దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+