వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు బుగ్గి: చూసి షాకైన చిరు, అరుణ కలత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న వస్తున్న వోల్వో బస్సు ప్రమాదానికి గురై, దగ్ధమై 45 మంది సజీవ దహనమైన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన స్థలికి పలువురు నేతలు వెళ్లారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం దగ్గర 44వ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ముందు వెళ్లే వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టాడు. దాంతో వోల్వో బస్సుకు సంబంధించిన డిజిల్ ట్యాకర్ పగిలి పోయింది. ట్యాంకర్ పగిలిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి.

బస్సులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉండడం, క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మంటలు ఎగిసిపడిన సమయంలో బస్సులో నుండి ఐదుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్‌లు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. డ్రైవర్, క్టీనర్ పారిపోయి అడ్డాకుల పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. బస్సులో మొత్తం 52మంది ఉండగా అందులో ప్రయాణికులు 50 మంది, డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రయాణికుల్లో 45 మంది మృత్యువాత పడ్డారు.

డికె అరుణ

డికె అరుణ

జిల్లా కాంగ్రెసు నాయకురాలు, మంత్రి డికె అరుణ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదం

ప్రమాదం

డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపి 02 టిఎ 0963 నంబరు గల వోల్వో బస్సు ప్రమాదానికి గురై, దగ్ధమై 45 మంది సజీవ దహనమైన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ప్రమాదం 2

ప్రమాదం 2

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం దగ్గర 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ముందు వెళ్లే వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోయి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టాడు.

ప్రమాదం 3

ప్రమాదం 3

జిల్లా కాంగ్రెసు నాయకురాలు, మంత్రి డికె అరుణ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి విశాఖపట్నం నుంచే ఎప్పటికప్పుడు డికె అరుణతో ఫోన్‌లో మాట్లాడుతూ సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.

చిరంజీవి

చిరంజీవి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలబడతాయని, ఇది ఘోర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్తిగా కాలిన బస్సు

పూర్తిగా కాలిన బస్సు

వోల్వో బస్సుకు సంబంధించిన డిజిల్ ట్యాకర్ పగిలి పోయింది. ట్యాంకర్ పగిలిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉండడం, క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

నేతలు

నేతలు

ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు జానా రెడ్డి, డికె అరుణ్, బొత్స సత్యనారాయణ తదితరులు.

నేతలు 2

నేతలు 2

పాలమూరులో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు జానా రెడ్డి, డికె అరుణ్, బొత్స సత్యనారాయణ తదితరులు.

చిరంజీవి 2

చిరంజీవి 2

ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి. ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలబడతాయని, ఇది ఘోర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదం 4

ప్రమాదం 4

వోల్వో బస్సుకు సంబంధించిన డిజిల్ ట్యాకర్ పగిలి పోయింది. ట్యాంకర్ పగిలిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉండడం, క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మంటలు ఎగిసిపడిన సమయంలో బస్సులో నుండి ఐదుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్‌లు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు.

English summary
State Minister DK Aruna, and Union Minister Chiranjeevi visited the Volvo bus accident spot in Mahaboobnagar district on Wednesday along with PCC chief Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X