కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవిష్యత్తుపై సమావేశం: కన్నీరు పెట్టిన డిఎల్

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప: తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు డిఎల్ రవీంద్రా రెడ్డి కన్నీరు పెట్టారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కడప జిల్లాలోని ఖాజీపేటలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు.

తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీరు పెట్టారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు.

తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది తేలుతుందని రవీంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రమంతా ఎన్టీఆర్ గాలి వీస్తున్న సమయంలో తాను, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో గెలిచామని ఆయన చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన డిఎల్ రవీంద్రారెడ్డి ఆయనతో విభేదాలు వచ్చి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన దాదాపుగా కాంగ్రెసు కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను వ్యతిరేకించిన కాంగ్రెసు నాయకుల్లో ఆయన ముఖ్యుడు. జగన్‌పై కడప లోకసభ స్థానంలో పోటీ కూడా చూశారు.

English summary

 Former minister DL Ravindra Reddy has wept in workers meeting held at Khajipet in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X