సినీ పరిశ్రమకు టాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే?
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకునే సమయంలో పరిశ్రమను టాలీవుడ్ అని సంభోదిస్తారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో మన పరిశ్రమ ఖ్యాతి మరింత ఇనుమడించింది. టాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. బెంగాలీ సినీ పరిశ్రమకు టాలీవుడ్ అనే పేరు ఉంది. ఆ రాష్ట్రంలోని టాలీగుంజే అనే ప్రాంతం పేరుతో టాలీవుడ్ అని సంభోదించడం మొదలుపెట్టారు. అయితే మన తెలుగు పరిశ్రమ బెంగాల్ ను మించి టాలీవుడ్ గా ముద్ర వేసుకుంది. తెలుగు పదంలోని టీ తీసుకొని హాలీవుడ్ లా టాలీవుడ్ అని సంభోదించడం మొదలుపెట్టారు.
హాలీవుడ్:అమెరికాలో నిర్మాణమయ్యే ఇంగ్లీషు సినిమాలను హాలీవుడ్ అని పిలుస్తుంటారు. ఇది ఒక ప్రాంతం పేరు. ఎక్కువగా సినిమా స్టూడియోలు ఉండేవి. దీంతోపాటు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది సెలబ్రిటీలు కూడా ఇక్కడే సెటిలవడంతో పరిశ్రమ మొత్తానికి హాలీవుడ్ పేరు సెట్ అయింది.

బాలీవుడ్ కి ఆ పేరు ఎలా వచ్చింది?:హిందీ సినీ పరిశ్రమను బాలీవుడ్ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అని భావించేవారు. బాంబే నుంచి బా తీసుకొని హాలీవుడ్ లా పలకడం కోసం బాలీవుడ్ అని చేర్చారు.
కోలీవుడ్:సాధారణంగా తమిళ సినీ పరిశ్రమను కోలీవుడ్ అని పిలుస్తుంటారు. చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలోనే సినీ పరిశ్రమ ఉండేది. అలా కే అక్షరాన్ని హాలీవుడ్ స్టైల్ లో మార్చి కోలీవుడ్ అని పిలవడం ప్రారంభించారు.
మాలీవుడ్, శాండల్ వుడ్:కేరళ వాసులను మల్లూ అని సంభోదిస్తుంటారు. అందుకే వారి సినిమా పరిశ్రమను మాలీవుడ్ అని పిలవడం ప్రారంభించారు. కన్నడ సినీ పరిశ్రమను మాత్రం శాండిల్ వుడ్ అని పిలుస్తారు. అక్కడ శాండిల్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి కన్నడ పరిశ్రమకు ఆ పేరు స్థిరపడిపోయింది.












Click it and Unblock the Notifications