పేర్ని నాని మంత్రి పదవి పోవడానికి కారణం తెలిసింది??
ఆంధ్రప్రదేశ్ మొదటి క్యాబినెట్‌లో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాల్ని మీడియాకు వెల్లడించేవారు పేర్ని నాని. ఆయన మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను జగన్‌కు పెద్ద పాలేరునని స్వయంగా ప్రకటించుకున్నారు. అంతేకాదు ఆయన సొంత సామాజిక వర్గాన్ని హేళన చేశారు. అయినప్పటికీ మంత్రి పదవి నిలవలేదు. అటు సొంత సామాజిక వర్గం దగ్గరకు రానివ్వడంలేదు.. ఇటు మంత్రి పదవీ లేదు. దీనికి ఒకే ఒక్కరు కారణమని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. ఆయన ఎవరో కాదు.. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.

ఉప్పు, నిప్పులా ఉన్న సంబంధాలు బహిర్గతం
పేర్ని నాని బాలశౌరిని లెక్కచేయడంలేదని మొదటి నుంచి ఎంపీ కినుక వహించారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. అయితే ముఖ్యమంత్రి జగన్‌తో బాలశౌరి వ్యాపార భాగస్వామి అని తెలుసు కాబట్టి సాధ్యమైనంతవరకు ఎక్కడా కామెంట్లు చేయకుండా మంత్రి వచ్చారు. ఇంతకాలం ఉప్పు, నిప్పులా వ్యవహరించిన బాలశౌరి, పేర్ని నాని సంబంధాలు రోడ్డున పడ్డాయి. నానిపై తన కోపాన్ని ఎంపీ బాలశౌరి బహిరంగంగానే వ్యక్తపరిచారు.

నానిపై విరుచుకుపడ్డ బాలశౌరి
ఇటీవల పేర్ని నాని వర్గీయులు ఎంపీ బాలశౌరిని అడ్డుకున్నారు. శుక్రవారం కూడా అలాంటి ప్రయత్నమే జరగ్గా ఎంపీ నానిపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కొణకొళ్ల నారాయణతో వారానికోసారన్నా మాట్లాడకపోతే నిద్ర పట్టదని, వైసీపీని తిట్టిన సుజనాచౌదరిలో కార్యక్రమాల్లో పాల్గొంటావా? అంటూ నిలదీశారు. ఎంపీ అంటే నీకు అలుసుగా ఉందని, ఇకనుంచి మచిలీపట్నం ఎంపీ అంటే ఏమిటో చూపిస్తానని, ఇకనుంచి తాను బందరులోనే ఉంటానంటూ సవాల్ విసిరారు.

నాని ప్రతిస్పందనపై ఉత్కంఠ
గత ఎన్నికల్లో బాలశౌరి గుంటూరు నుంచి మచిలీపట్నం వలసవెళ్లి అక్కడి నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తనకన్నా అధిష్టానం దగ్గర బాలశౌరికే ఎక్కువ పలుకుబడి ఉందని నానికి తెలుసు. ప్రస్తుతానికి మంత్రి పదవి లేదు. పార్టీపరంగా మాత్రం ఒక హోదా కట్టబెట్టారు. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ పెరగాలి అనే విషయంపై తమ నాయకుడికి ఒక స్పష్టత ఉందని నాని అనుచరులు చెబుతున్నారు.
ఎంపీ బాలశౌరి నేరుగా విసిరిన సవాల్‌కు పేర్ని నాని ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.












Click it and Unblock the Notifications