Hand Transplantation: పురుషుడికి మహిళ చేతులు అమరిక..

కొంత మందిలో పుట్టుకతో అంధత్వం వస్తుంది. వారికి ఇతరు కళ్లు అమరిస్తే చూపు వస్తుందంటే.. ఎవరైనా కళ్లు దానం చేస్తే వారికి చూపు వస్తుంది. అలాగే కొంత మందికి కిడ్నాలు ఫేలవుతుంటాయి. వారికి కూడా ఎవరైన కిడ్నీ దానం చేస్తే వారు బతుకుతారు. అందుకే అవయవదానం గొప్పదని చెబుతారు. తాజాగా రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి ఆపరేషన్ చేసి చేతులను అమర్చారు. ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి వైద్య బృందం అతడికి పునర్జన్మ నిచ్చారు.

ఢల్లీ చెందిన 45 ఏళ్ల వ్యక్తి పెయింటర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతను 2020లో రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలో రైలు ఢీకొట్టడంతో రెండు చేతులు కోల్పోయాడు. దీంతో అతను చేతులు లేకుండానే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గంగారామ్ వైద్యులను సంప్రదించాడు. వైద్యులు ఇతరు చేతులు అమర్చవచ్చని చెప్పారు. కాగా.. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ బ్రేన్ డెడ్ అయి చనిపోయారు.

Doctors at Delhi s Gangaram Hospital implanted a woman s hand into a man s

దీంతో చేతులు తీసి పెయింటర్ చేతికి అమర్చారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అతను చేతులను, చేతి వేళ్లను కదిలిస్తున్నాడని వివరించారు. వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేయడానికి 12 గంటల సమయం తీసుకున్నారు. పెయింటర్ ను త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ తన అవయవాలతో మరో ముగ్గురికి పునర్జన్మనిచ్చిచారు.

ఈ శస్త్రచికిత్సలో దాత చేతులు మరియు గ్రహీత చేతుల మధ్య ఉన్న ప్రతి ధమని, కండరం, స్నాయువు, నరాలను అనుసంధానించినట్లు వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+