కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్డేట్- షిఫ్టింగ్, జగన్ కు సమాచారం...!!

వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యం పైన కీలక అప్డేట్ అందుతోంది. గుండె సంబంధిత సమస్యలతో కొడాలి నాని ముంబాయిలోని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పై వైద్యులు కీలక అంశాలను వెల్లడించారు. నానికి గుండె శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తరువాత కొడాలి నాని క్రమేణా కోలుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లా డారు. జగన్ సూచనల మేరకు మాజీ మంత్రి ముంబాయి వెళ్తున్నారు.

కోలుకున్న కొడాలి నాని
గుండె ఆపరేషన్ తరువాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఐసీయూ నుంచి సాధారణ రూమ్ కు తరలించారు. కొడాలి నాని తిరిగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలోనే నెమ్మదిగా నడిపించినట్లు నాని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. కొడాలి నాని ఈ నెల 19 లేదా 20న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఏజీఐ లో భవిష్యత్ చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొడాలి నాని కోలుకోవటంతో.. మరి కొంత కాలం హైదరాబాద్ లోనే ఉండనున్నారు. వచ్చే నెల మరోసారి ముంబాయి ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది.

doctors-reveals-kodali-nanis-health-condition-details-here

జగన్ కు సమాచారం
కొడాలి నాని ఆరోగ్యం పైన మాజీ సీఎం జగన్ ఆరా తీసారు. కాగా, తాజాగా కొడాలి నాని డిశ్చార్జ్ సమాచారం జగన్ కు అందించారు. దీంతో, కొడాలి నాని పరామర్శ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ముంబాయి వెళ్లనున్నట్లు పార్టీ నేతల సమాచారం. నాని కోలుకున్నా.. కొంత కాలంగా పూర్తిగా రాజ కీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా, నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు.. పార్టీ కేడర్ పూజలు చేసింది. తొలుత హైదరాబాద్ లో నానికి వైద్య పరీక్ష లు చేసిన సమయంలో గుండెలో మూడు రక్త నాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ అవసరమని నిర్ధారించటంతో ప్రత్యేక విమానంలో ముంబాయికు తరలించారు.

తిరిగి హైదరాబాద్ కు

దీంతో, ఈ నెల 2వ తేదీన ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వ హించారు. సర్జరీ నిర్వహించిన తరువాత వీడియో కాల్ ద్వారా తొలుత కుటుంబ సభ్యులతో వైద్యులు మాట్లాడించారు. ఇప్పుడు ఆస్పత్రిలోనే నెమ్మదిగా నడిపిస్తున్నారు. సర్జరీ తరువాత తొలుత నెల రోజుల వరకు ఆస్పత్రిలో నే నాని ఉండాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. ఇప్పుడు నాని కోలుకోవటంతో.. మిగిలిన చికిత్స హైదరాబాద్ లో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ నెల 20న నాని ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే, నాని ఆరోగ్య కారణాలతో ఎవరినీ కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+