ప్రియుడితో భార్యను రెడ్ హ్యాండెడ్ పట్టుకొనెలా ప్లాన్ చేశాడు, చివరికిలా...
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను తీసింది. ఆరేళ్ళ నుండి తనతో సహాజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడాన్ని సహించలేక హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకొంది
విశాఖపట్టణం:వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను తీసింది. ఆరేళ్ళ నుండి తనతో సహాజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడాన్ని సహించలేక హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకొంది.
విశాఖ జిల్లాలోని కె.వి. శరభవరం పంచాయితీ శివారు కృష్ణాపురం గ్రామానికి చెందిన వంజరి రాము అనుమానంతో తనతో సహజీవనం చేస్తున్న సంధ్యారాణి ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రాంబాబును కిరాతకంగా గునపంతో కొట్టిచంపాడు. ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకొంది.
మొదటి భార్యకు దూరంగా ఉంటూ ఆరేళ్ళ నుండి సంధ్యారాణితో ఉంటున్నాడు రాము. వీరికి మూడేళ్ళ కొడుకు కూడ ఉన్నాడు. అయితే కొంతకాలంగా వెదురుపల్లికి చెందిన రాంబాబుతో కూడ సంధ్యారాణి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయాన్ని గమనించిన రాము పద్దతి మార్చుకోవాలని సంధ్యారాణిని మందలించడాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు.శుక్రవారం రాత్రి కృష్ణాపురం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు రాము, సంధ్యారాణి కలిసివెళ్ళారు.
ఆ పెళ్లికి రాంబాబుకు కూడ వచ్చాడు. దీంతో రాము అనుమానం మరింత బలపడింది. వీరి ప్రవర్తనపై కన్నేసిన రాము మద్యం మత్తులో ఉన్నట్టు నటించాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర వస్తోందని సంధ్యారాణితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు.
అయితే మత్తుగా పడుకొన్నాడని భావించిన సంధ్యారాణి పెరట్లో వేచి ఉన్న రాంబాబు వద్దకు వెళ్ళింది సంధ్యారాణి.ఈ విషయాన్ని గమనించిన రాము గునపంతో ఇద్దరిపై దాడి చేశాడు. వారి కళ్ళు, ముఖాలపై కసితీరా కొట్టి ప్రాణాలు తీశాడు. వారి కేకలు విని చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి చూస్తే రాంబాబు, సంధ్యారాణి రక్తం మడుగులో ఉన్నారు. రాము పోలీసులకు లొంగిపోయాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications