డూప్లికేట్ 'అభ్యర్థుల ప్రకటన'పై జనసేన స్పందన, ఫిర్యాదు చేయండి.. పవన్ కళ్యాణ్ సీరియస్
అమరావతి: జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్ కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ ప్యాడ్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. జనసేన నుంచి బెజవాడలో పలువురికి టిక్కెట్లు ఇస్తున్నట్లు నకిలీ లెటర్ ప్యాడ్ ద్వారా ప్రకటన చేశారు.
ఈ నకిలీ లెటర్ ప్యాడ్ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నారు. రేపు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ లీగల్ సెల్ నేతలకు జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ సంతకంతో ఉన్న జనసేన నకిలీ లెటర్ ప్యాడ్ రెండు రోజులుగా నెట్లో వైరల్ అవుతోంది. తమ పార్టీ అభ్యర్థులకు సహకరించాలని, వారిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ అందులో పేర్కొన్నట్లుగా ఉంది.

విజయవాడలో ముగ్గురు అభ్యర్థులు వీరే అంటూ
ఆ నకిలీ లెటర్ ప్యాడ్‌లో 'విజయవాడ సెంట్రల్ శాసన సభ అభ్యర్థిగా శ్రీ కొంగటి సత్యం గారిని, తూర్పు శాసన సభ అభ్యర్థిగా శ్రీ పొతిన మహేష్ గారిని, పశ్చిమ శాసన సభ అభ్యర్థిగా శ్రీ కొరడా విజయ కుమార్ గారిని, ఖరారు చేయడం జరిగిందని' అందులో పేర్కొన్నారు. దీనిపై జనసేన, పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాయి.
ఇది నిజం కాదు
'విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రెస్ నోట్ నిజం కాదని, పార్టీ ఎవరిని కూడా అభ్యర్థులుగా ఖరారు చేయలేదని, జనసేన పార్టీకి సంబంధించిన వివరాలు ఏవైనా సరే పార్టీ విడుదల చేస్తుందని, దయచేసి జనసైనికులు, ప్రజలు గమనించగలరని పేర్కొన్నారు. ఇది నిజం కాదు.. అని పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.

గతంలోను ప్రచారం, కన్ఫ్యూజ్ చేసేందుకే
అసలు ఈ నకిలీ లెటర్ ప్యాడ్ ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో జనసేన వర్గాలు ఆరా తీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించకముందే జనసైనికులను కన్ఫ్యూజ్ చేసేందుకు ఇలాంటివి చేస్తున్నారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు లెటర్ ప్యాడ్ ద్వారా అసత్య ప్రచారం జరిగింది. గతంలోను పవన్ ప్రకటించకముందే ఓ అభ్యర్థిని ప్రకటించినట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానిని కూడా జనసేన ఖండించింది.
-
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications