దువ్వాడ కోసం మాధురి ఖరీదైన బహుమతులు, నాగులచవితి పూజలు.. రచ్చ మాములుగా లేదుగా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ల వ్యవహారం సృష్టించిన రచ్చ అంతా కాదు. ఇది తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైన విషయం అందరికీ తెలిసిందే . దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి ల వివాహేతర సంబంధం పైన దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి చేసిన సంచలన ఆరోపణలు ఆయన ఇంటి వద్ద కొనసాగిన హైడ్రామా తర్వాత విషయం మరింత పబ్లిక్ అయింది.

సోషల్ మీడియాలో దువ్వాడ వారి ప్రేమ కథా చిత్రం
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరిపైన పెద్ద ఎత్తున చర్చే జరుగుతుంది. సమాజాన్ని పట్టించుకోకుండా ఈ జంట చేస్తున్న పనులపై జనాలు అవాక్కవుతున్నారు. ఇక ఇటీవల తిరుమలలో వీరిద్దరు చేసిన ఫోటోషూట్ వ్యవహారం కూడా తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేసే దివ్వెల మాదిరి తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Duvvada srinivas divvala Madhuri videos of expensive gifts Nagulachavithi Pujas went viral

దువ్వాడ శ్రీనివాస్ కు కాస్ట్లీ బహుమతి ఇచ్చిన మాధురి
దువ్వాడ శ్రీనివాస్ కు కాస్ట్లీ బహుమతి ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హల్చల్ చేశారు. ఖరీదైన బహుమానాలు ఇచ్చి అందరూ చర్చించుకునేలా చేశారు. దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన దివ్వల మాధురి ఆయనకు ఖరీదైన రాడో వాచ్ ను బహుమానంగా ఇచ్చారు.బర్త్ డే కానుకగా దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వల మాధురి ఇచ్చిన వాచ్ ఖరీదు 2లక్షల వరకు ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

నాగుల చవితి పూజలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ , మాధురి
దివ్వల మాధురి ఇచ్చిన వాచ్ ఖరీదును google లో సెర్చ్ చేస్తున్నారు . ప్రస్తుతం సహజీవనం చేస్తున్నామని చెబుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటన చేసింది. ఇక తాజాగా దివ్వల మాధురి చేసిన మరొక పోస్టులో దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి దివ్వల మాదిరి నాగుల చవితి పూజలు చేశారు. ఓ పుట్ట వద్దకు వెళ్లి పుట్టను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు.

సోషల్ మీడియాలో పోస్టు వైరల్
దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురికి సంబంధించిన నాగుల చవితి పూజల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోని చూసి పలువురు నెటిజెన్లు వీరిద్దరిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరేం అనుకున్నా సరే నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న ఈ జంట. తాజాగా నాగుల చవితి సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు చేసి ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+