చంపాలనుకుంటే రండి.. నేను రెడీ!: దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ (వీడియో)
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అర్ధరాత్రి పూట హైడ్రామా చోటుచేసుకుంది. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షమై ప్రత్యర్థులకు పదునైన సవాళ్లు విసిరారు. దువ్వాడ శ్రీనివాస్ రాష్ట్ర మంత్రులకు, ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసరడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
"చంపాలనుకుంటే రండి.. నేను రెడీ!"
నిమ్మాడ జంక్షన్ వేదికగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. "నన్ను చంపాలనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను, దమ్ముంటే రండి. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను, దేనికైనా సిద్ధం" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎదుటివారిని ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

"కేడీ బ్రదర్స్ రాజకీయాన్ని భ్రష్టు పట్టించారు"
మంత్రి అచ్చెన్నాయుడు, ధర్మాన కృష్ణదాస్‌లను 'కేడీ బ్రదర్స్'గా అభివర్ణించిన దువ్వాడ, వారిద్దరూ కలిసి జిల్లా రాజకీయాలను దిగజార్చారని విమర్శించారు. ఒకరు అధికార పార్టీలో, మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి సవాళ్లు విసరడంతో నిమ్మాడ జంక్షన్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూనే, భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications