అలా పిఠాపురంలో - ఆ ఇద్దరి బాటలో పవన్..!!
పవన్ కల్యాణ్ ఏరి కోరి ఎంపిక చేసుకున్న నియోజకవర్గం పిఠాపురం. 2024 లో ఇక్కడి నుంచి పోటీ చేసి తొలి సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత నియోజకవర్గం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఈ హోదాలో ఉండగానే.. నియోజకవర్గానికి కొత్త రూపు తేవాలని భావిస్తున్నారు. ఇందు కోసం పాలనా పరంగా - రాజకీయంగా వరుస నిర్ణయాలు తీసుకుంటు న్నారు. సొంత నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు, జగన్ బాటలోనే పవన్ వెళ్తున్నారు.
పవన్ వ్యూహాలు
పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి గతంలో లేని ప్రాధాన్యత లభిస్తోంది. కుప్పంతో సమానం గా పిఠాపురం కు అన్ని హంగులు సమకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తాజాగా పిఠాపురం కోసం మంత్రివర్గ భేటీల్లో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నేతలు తమ నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. సీఎం చంద్రబాబు కుప్పం కు గతం కంటే ఈ సారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్ సీఎం అయిన తరువాత పులివెందుల కోసం పలు నిర్ణయాలు అమలు చేసారు. ఇప్పుడు పవన్ సైతం పిఠాపురం కోసం అదే తరహాలో ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.

పిఠాపురం కోసం
తన నియోజకవర్గం భవిష్యత్ కంచుకోటగా మార్చే క్రమంలో ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నారు. దీంతో, ఎలాంటి సందర్భంలో అయినా రాజకీయంగా తనకు నియోజకవర్గం మద్దతు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసారు. నియోజకవర్గ డెవలప్‌మెంట్ కోసం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయించారు. అక్కడ ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసు పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం రూ. 40 కోట్లకు ఆమోదం తెలిపారు. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేశారు. గొల్లప్రోలులో తాగునీటి కోసం పైప్‌లైన్, మోటార్ల మరమ్మత్తుల కోసం రూ. 72 లక్షల విలువైన పనులు చేపట్టారు.
వరుస నిర్ణయాలు
గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు మొదలు పెట్టారు. ఇక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉండటంతో.. రైలు సౌకర్యం గురించి కేంద్రంతో చర్చించారు. రాజకీయంగా నూ పవన్ పిఠాపురం కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ వేడుకల ను పిఠాపురంలో ప్లీనరీగా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఇక్కడకు తరలి రానున్నారు. పిఠాపురం కేంద్రంగా సొంత ఇంటిని సిద్దం చేసుకుంటున్న పవన్.. భవిష్యత్ లోనూ పిఠాపురంలో తన ముద్ర ఉండేలా నిర్ణయాలు అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications