జామకాయ తింటే ఆస్పత్రికి వెళ్లే అవసరం రాదు

మనకు అందుబాటు ధరలో, దగ్గరగానే దొరుకుతుంది కదా అని చాలా మంది జామకాయలపై నిర్లక్ష్యం వహిస్తారు. వాస్తవానికి యాపిల్, మామిడి, స్ట్రాబెర్రీ పళ్లకన్నా ఎక్కువ విటమిన్లు జామలోనే ఉంటాయి. జామపళ్లపై అందరూ అవగాహన చేసుకుంటున్న క్రమంలోనే వీటి ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. జామపండు వల్ల ఎటువంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.

జామ పళ్లలో విటమిన్ ఏ, బి, సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పోలిక్ యాసిడ్, పొటాషియం లభిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువ. షుగరు వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా తినవల్సిన కాయ జామకాయ. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా జామ పనిచేస్తుంది. నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు జామ దివ్యౌషదంలా పనిచేస్తుంది.

eatingguvva

గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందడంతోపాటు సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తింది. కొవ్వు, క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్‌ను నివారించడంతోపాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నివారిణిగా జామ ఉపయోగపడుతుంది. జామ ఆకులు నమిలితే పంటి నొప్పులు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. కీళ్లవాపు, నొప్పులు ఉన్న వారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్న చోట కడితే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

జామ ఆకులను నీటిలో మరగబెట్టి డికాక్షన్‌లా వాడితే దగ్గు, జలుబును తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజుకొక జామ పండు తింటే సత్వరమే ఫలితం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+