ఈనాడు రామోజీ రావు కన్నుమూత
Ramoji Rao: ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 5వ తేదీన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. శుక్రవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై రామోజీ రావుకు కృత్రిమ శ్వాసను అందించారు డాక్టర్లు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు.

తెలుగునాట మీడియా మొఘల్‌గా ఎదిగారు రామోజీ రావు. ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు. తనదైన ముద్ర వేశారు. తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు. ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సెగ్మెంట్‌లోనూ ఆయన అడుగులు వేశారు. అక్కడా విజయవంతం అయ్యారు.
నిర్మాతగా టాలీవుడ్‌లో ఎన్నో మరపురాని సినిమాలను నిర్మించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. సమాజాన్ని మేలుకొలిపేలా ఆయన సినిమాలు ఉంటాయనే గుర్తింపును పొందారు. మయూరి, ప్రతిఘటన, మౌనపోరాటం వంటి ఎన్నో సందేశాత్మక సినిమాలు వెలవడ్డాయి ఆయన బ్యానర్ నుంచి.
రామోజీ రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోన్నారు. రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాలు విషాదంలో మునిగిపోయాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications