జగన్‌కు ఆమె ముద్దు, నెట్లో హల్‌చల్: పాపపు మాటలని దుమ్మెత్తిపోసిన మహిళ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వృద్ధురాలిని ముద్దు పెట్టుకున్న ఫోటో నెట్లో హల్‌చల్ సృష్టించింది. దీనిపై పలు కామెంట్లు వచ్చాయి. దీంతో ఆమె స్పందించారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వృద్ధురాలిని ముద్దు పెట్టుకున్న ఫోటో నెట్లో హల్‌చల్ సృష్టించింది. దీనిపై పలు కామెంట్లు వచ్చాయి. దీంతో ఆమె స్పందించారు.

ఈ ఫోటోపై తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారని, ఒకడికి 45, రెండో వాడికి 40, మూడోవాడికి 35 ఏళ్లున్నాయని చెప్పారు.

తన వయసు ఎంతో, తన పిల్లల వయసు ఎంతో అర్థం చేసుకోవాలన్నారు. పాపపు మాటలు మాట్లాడవద్దన్నారు. తన బిడ్డాలంటోడు తన ఊరికి వచ్చాడని, మా పల్లెటూరు వచ్చాడని, మేం ఆ దేశం వెళ్లి ఆ రాజును చూడలేమని, మా వద్దకు వచ్చాడని ఆప్యాయంగా వెళ్లానని చెప్పారు.

Elderly woman gives befitting reply

అంతేకానీ, రాజకీయం అయితే తాము చూడనే చూడమన్నారు. ఎవరైనా చూడని, తమకు ఎవరైనా ఒకటే అన్నారు. మనం ఆ సమయంలో వేసేది ఒకే ఓటు అని, ఇవన్నీ తమకు ఏం తెలుస్తాయన్నారు. మీరనుకునేవన్నీ చెత్త మాటలు, చెత్త రాతలు అన్నారు.

చెత్తమాటలు రాస్తే పాపం కట్టుకుపోతారని మండిపడ్డారు. జరిగిన నిజం తెలుసుకోకుండా, తన వయస్సు కూడా ఏమిటో గుర్తించకుండా... వాడి తల్లిలాంటిదానిని అన్నారు.

తనను అవమానిస్తే ఎవడైనా వాడి తల్లిని అవమానించినట్లే అన్నాు. రాసిన వాడు తనను అవమానించినట్లు కాదని, వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లే అన్నారు. రాసేటప్పుడు వయస్సు కూడా చూసుకోవాలని, ఏదో చేతికి వచ్చేసింది రాయొద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+