ఏపీలో మరో ఎన్నికల సమరం - షెడ్యూల్ విడుదల..!!

ఏపీలో మరో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

ఏపీలో మరో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో మూడు పట్టభద్రులు..రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు.. తొమ్మది స్థానిక సంస్థల కోటా నుంచి తొమ్మది మంది ఎన్నిక కావాల్సి ఉంది. దీనికి సంబందించి ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27 నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు. మార్చి 13న పోలింగ్ జరగనుంది. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం -నెల్లూరు- చిత్తూరు నియోజకవర్గంతో పాటుగా కడప- అనంతపురం- కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదల అయింది. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బాలసుబ్రమణ్యం..కత్తి నరసింహా రెడ్డి మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. అదే విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసారు. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి మార్చి 29న రిటైర్ కానున్నారు. కడప- అనంతపురం- కర్నూలు ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాలరెడ్డి కూడా అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు.

Election Commision Releases Election Schedule for MLC Elections in Andhra Pradesh

వీటితో పాటుగా తొమ్మది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ తొమ్మది సీట్లు టీడీపీ నేతలకు చెందినవే. ఈ తొమ్మది స్థానాల్లోని ప్రస్తుత సభ్యుల్లో ఇద్దరు మార్చి 29, మరో ఏడుగురు మే 1వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో అనంతపురం నుంచి దీపక్ రెడ్డి, కడప నుంచి బీ టెక్ రవి స్థానాల్లో ఎన్నిక జరగనుంది. నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి నుంచి అంగర రామ్మోహన్ రావు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, తూర్పు గోదావరి నుంచి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం నుంచి శత్రుచర్ల విజయరామ రాజు, చిత్తూరు నుంచి రాజనర్సింహులు, కర్నూలు నుంచి కేఈ ప్రభాకర్ అదే రోజు రిటైర్ కానున్నారు. ఈ స్థానాలకు మార్చి 13న పోలింగ్ జరగనుంది. ఇవన్నీ వైసీపీ ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+