చంద్రబాబు సర్కార్ పనితీరు ఎలా ఉంది ? ఎలక్షన్ అనలిస్ట్ సంచలన ఫీడ్ బ్యాక్..!

ఏపీలో కూటమి సర్కార్ ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం ఎన్నికల్లో ఓటర్లు తమకు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పనిచేస్తోందా ? భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి. ? వాటిని అందుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందా విఫలమైందా ? ఇదే అంశంపై గత ఎన్నికల్లో సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషణలు చేసిన అనలిస్ట్ ప్రవీణ్ పుల్లట తాజాగా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పేశారు.

ఆరు నెలల చంద్రబాబు పాలనపై స్పందిస్తూ పొలిటికల్ అనలిస్ట్ ప్రవీణ్ పుల్లట .. ఇంతటి భారీ విజయం దక్కిన తర్వాత ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు..ఎందుకని? అని ప్రశ్నించారు. ప్రజలు ఎక్కువగా ఆశిస్తున్నారా? లేదా పైవారు బలహీనంగా ఉన్నట్లా? అని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించబోతోందని చాలా ముందుగా చెప్పిన వారిలో ప్రవీణ్ పుల్లట కూడా ఒకరు.

election survey analyst Praveen pullata view on Chandrababu govt s six months rule

అలాంటి ప్రవీణ్ పుల్లట ఆరునెలల ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలు కూడా చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అలాగే అధికారుల బదిలీలలో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.. అని ప్రవీణ్ తెలిపారు. బాబూ..మీరేనా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అని సాక్షాత్తూ తమ్ముళ్లే ప్రశ్నిస్తున్నారు సర్.. అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై కూటమి పార్టీలతో పాటు ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+